ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 16: మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డి గూడా గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యాదయ్యతో పాటు సుమారు 100 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేవెళ్ల నియోజకవర్గ పిసిసి మెంబర్ రాచమల్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు యాదయ్య తెలియజేశారు.ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం పిసిసి మెంబర్ రాచమల్ల సిద్దేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజలను అనేక విధాలుగా మోసం చేసిందని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు దళితులకు మూడెకరాల భూమి అనేక వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజలను మోసం కెసిఆర్ చేశారని రాచమల్ల సిద్దేశ్వర్ అన్నారు.చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి (111జీవొ) త్రిబుల్ వన్ జీవో విషయంలో కూడా స్థానిక శాసనసభ్యుడు కాలే యాదయ్య ముఖ్యమంత్రి ఇంతవరకు త్రిబుల్ వన్ జీవొ ఎత్తేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని సిద్దేశ్వర్ ఆరోపించారు.రాబోయే రోజులలో చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం తద్యమని ఆయన అన్నారు.బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గ్రామ కమిటీ అధ్యక్షుడు యాదయ్య,ముత్యాలు,శ్రీశైలం, విష్ణు,చంద్రాకాంత్,స్వామీ,ఎస్ కృష్ణ యాదవ్,జి కృష్ణ యాదవ్, గోపాల్,శశిధర్,భాను చందర్, చిరంజీవి,తదితర ముఖ్య నాయకులతో పాటు సుమారు వందమంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినారని రాచమల్ల సిద్దేశ్వర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎర్ర విజయరాజ్ గ్రామ పార్టీ అధ్యక్షులు,రాఘవరెడ్డి,చంద్రారె డ్డి ,భాస్కర్,ఫిరోజ్,విజయేందర్,వెం కట్ రెడ్డి,బుచ్చి రెడ్డి,కీసరి సంజీవ రెడ్డి,సద్గుణ చారి,తుప్పరి మాణిక్యం,బంటు సంజీవ, సంతపూరం శ్రీను,జీనుకుంట పాండు,ఇంద్రపాటి సుధాకర్,జినుకుంట అశోక్,తుప్పరి అశోక్,జినుకుంట రాములు,కేసరీ శ్రీకాంత్ రెడ్డి,సంతపురం రవిందర్,రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.