బిఆర్ ఎస్ కు ఎమ్మార్పీఎస్ టిఎస్ సంపూర్ణ మద్దతు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 13: ఈ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీకి ఎమ్మార్పీఎస్ టి ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ, జిల్లా ఇంఛార్జి దండోరా శివరాజ్ లు తెలిపారు. తెలంగాణ భవిష్యత్ దృష్ట్యా కేసీఆర్ కు తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఇస్తున్నట్లు ప్రకటించారు.ఎమ్మార్పీఎస్ టిఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయం జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ,  జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్  ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లాలో జిల్లా ఇన్చార్జి దండోరా శివరాజ్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ టి ఎస్ సమావేశం నిర్వహించారు. సోమవారం సిద్దిపేటలో వారు మాట్లాడుతూ.. సంక్షేమం, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ,  డప్పుచెప్పు వృత్తిదారులకు పెన్షన్, హైదరాబాద్ నడిబొడ్డున ఎకరం స్థలం కేటాయించి మాదిగ భవన నిర్మాణం,  విద్య వైద్య రాజకీయ రంగాలలో మా జనాభా ఎంతో మాకు అంత వాటా కొరకే డిమాండ్ చేస్తూ  మంత్రి తన్నీరు హరీష్ రావు అన్న ముందు డిమాండ్లు ఉంచగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. మాదిగ ఉపకులాల హక్కుల భంగం కలగకుండా న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని భరోసా కల్పించిన హరీష్ రావుకు కృతజ్ఞత తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా తరఫున సిద్దిపేట హుస్నాబాద్ గజ్వేల్ దుబ్బాక జనగామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు  ఎమ్మార్పీఎస్ టీఎస్ ప్రకటిస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ బిజెపిలో మాదిగలను మోసం చేస్తూ వస్తున్న పార్టీలుగా దళితులపై దాడులు చేసిన స్పందించని కాంగ్రెస్ బిజెపి పార్టీలో ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తూ మరోసారి కాంగ్రెస్ బిజెపి మోసం చేయడానికి వస్తున్నాయని అన్నారు.  మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డిలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన వంద రోజులలో వర్గీకరణ చేస్తామని 10 సంవత్సరాలు గడుస్తున్న వర్గీకరణ చేయకపోవడం దానికి మందకృష్ణ మాదిగ జాతిని తాకట్టుపెట్టి స్వలాభం కోసం భారీ జన సమీకరణ చేసి బిజెపి నరేంద్ర మోడీకి దండం పెట్టేలా దక్షిణ భారతదేశం మాదిగలను మరోసారి మోసం చేసిన బిజెపి పార్టీ అభ్యర్థులను మాదిగ వాడల్లోకి రావద్దని, వారిని  ఎక్కడికక్కడే అడ్డుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశపాక రాజేందర్ మాదిగ జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేంద్ర మాదిగ, గౌరవ అధ్యక్షులు బొంబాయి వెంకన్న,  జిల్లా మాజీ అధ్యక్షులు దుర్గని నర్సింలు మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాల కృష్ణ మాదిగ , ఎర్ర ఎల్లం, దేవులపల్లి రాజేందర్, గుడికందుల ఎల్లం, బాలిగారి కృష్ణ, సిద్ధిని రాజమల్లయ్య, గడ్డం వెంకటేష్, దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు జంగాపల్లి సాయిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page