బిజెపికే  మాదిగ, మాదిగ ఉపకులాల సంపూర్ణ మద్దతు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ((బిజెపి)కి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. బుధవారంసిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన   సమావేశంలో మాట్లాడుతూ . మూడు దశాబ్దాలుగా సామాజిక పరివర్తకులు మందకృష్ణ మాదిగ  నాయకత్వంలోమాదిగ మాదిగ ఉప కులాల  ఆకాంక్ష అయినటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ చివరి దశకు చేరుకుందన్నారు. సాక్షాత్తు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఈనెల 11న లక్షలాది మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధానమంత్రి స్థాయిలో హామీ ఇచ్చారన్నారు.  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఈనెల 18 న హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో తక్షణమే. టాస్క్ ఫోర్సువర్గీకరణ వేగవంతానికి మాత్రమే కమిటీ వేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తానని స్పష్టమైన మాట ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో బిజెపికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు చెప్పారు.  దానిలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలో పాటు జిల్లా వ్యాప్తంగా మాదిగ మాదిగ ఉపకులాల సంపూర్ణ మద్దతు బిజెపికి అని  తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాదిగ సమాజం బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు మరి ఏ ఇతర పార్టీలకు ఓట్లు వేయరాదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాదాపు దశాబ్ద కాలం  అధికారంలో ఉందని, సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిందన్నారు. అంతేకాదు మాదిగలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎలాంటి కారణం లేకుండా తీసివేసే అవమానించారని విమర్షించారు. మంత్రి వర్గంలో మాదిగలకు స్థానం కల్పించలేదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా షెడ్యూల్ కులాల వర్గీకరణ నా బాధ్యత తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని మాట ఇచ్చి దాన్ని  నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు.  అదేవిధంగా టీఎస్పీఎస్సీ లో గాని ఉన్నత విద్యా మండలి లో గాని ఏ ఒక్కరికి కూడా మాదిగ కులాలకు స్థానం లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు అధికారంలో ఉండి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూనే మాదిగ మాదిగ ఉపకులాల ఓట్లను వేసుకుంటూ ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం అధికారం కలిగినప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి అవకాశం ఉందని,
 వర్గీకరణకు సంబంధించి 1965 లోకూరు కమిషన్, 1996లో రామ్ చంద్ర రాజ్ కమిషన్ అదే విధంగా 2007లో జస్టిస్ ఉష కమిషన్ కూడా వర్గీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగిందన్నారు.కానీ ఇవన్నీ పక్కనపెట్టి వర్గీకరణ పట్ల జాప్యం చేస్తూ విద్య ఉద్యోగ సంక్షేమ అన్ని రంగాల్లో మాదిగ మాదిగ ఉప కులాలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలారా సామాజిక న్యాయాన్ని కోరుకునే అన్ని వర్గాల ప్రజాస్వామిక వాదులారా ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలే కాదు మాదిగల ఉపకులాల తరతరాల భవిష్యత్తుకు సంబంధించిన వర్గీకరణ రిజర్వేషన్ ప్రక్రియ భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి వర్గీకరణ సాధించడం అంటే మాదిగలు మాదిగ ఉప కులాలు పిల్లల భవిష్యత్ వర్గీకరణతో ముడిపడి ఉందన్నారు. కావున వర్గీకరణకు సాక్షాత్తు భారతదేశ ప్రధాని ప్రత్యక్షంగా మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో పాల్గొని హామీ ఇవ్వడాన్ని విశ్వసిస్తూ మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలంతా సంపూర్ణ మద్దతు బిజెపి పార్టీకి, తమ తమ ఓటును బిజెపి పార్టీకి వెయ్యాలని ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సిద్దిపేట జిల్లా కమిటీలను పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో
 మల్లిగారి యాదగిరి మాదిగ, ముండ్రాతి కృష్ణ మాదిగ,జె పి లత మాదిగ, మైసరాములు మాదిగ, సామ్రాట్ ప్రకాష్, పెరిక పరశురాములు, జరిపోతుల లక్ష్మణ్, సుంచు రమేష్, లింగంపల్లి రాకేష్, మాట్ల వెంకటస్వామి,  సనవల ప్రసాద్ కందికట్ల రాజు,మాతంగి జితేందర్, బెజ్జంకి శంకర్,బండ ఐలయ్య, సుందరగిరి భాస్కర్,కొలుగూరి అశోక్, పెరిక ప్రశాంత్, బంగారు నర్సింహులు, శారద మాదిగ  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page