బిజెపి అధికారంలోకి వొస్తే ఉచిత విద్య, వైద్యం

పాదయాత్రలో చాయ్‌పే చర్చ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌బీజేపీ అధికారంలోకి వొస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు. పాదయాత్రలో భాగంగా కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు కాలనీలో ఆయన చాయ్‌ ‌పే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను సంజయ్‌ ‌దృష్టికి తీసుకొచ్చారు. అర్హులకు దళితబంధు, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు ఇవ్వడం లేదని వాపోయారు. కాలనీలో పార్కులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ‌పాలనలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని..తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.

రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని..అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హావి• ఇచ్చారు. కమ్యూనిటీ సెంటర్‌ ‌నుంచి మూడోరోజు బుధవారం బండి సంజయ్‌ ‌పాదయాత్ర శేష గ్రాండ్‌ ‌హోటల్‌, ‌రెయిన్‌బో విస్టాస్‌, అం‌జయ్య నగర్‌, ‌చిత్తారమ్మ ఆలయం, మూసాపేట, భరత్‌ ‌నగర్‌ అం‌డర్‌ ‌బ్రిడ్జి, జింకలవాడ, దీన్‌ ‌దయాల్‌ ‌నగర్‌, ‌పైపులైను రోడ్డు, శోభనా థియేటర్‌ ‌వి•దుగా బాలానగర్‌ ‌గ్రామం వరకు కొనసాగింది. వీఆర్‌ఏలపై పోలీసుల లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నల్లబ్యాడ్జిలు ధరించి పాదయాత్ర చేపట్టారు. బాలనగర్‌ ‌గ్రామం సవి•పంలో బండి సంజయ్‌ ‌రాత్రి బస చేయనున్నారు. బుధవారం మొత్తం 13 కిలోవి•టర్ల మేర బీజేపీ అధ్యక్షుడి పాదయాత్ర కొనసాగగా వీఆర్‌ఏలపై కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌లాఠీ ఛార్జ్‌ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు, కండువాలు ధరించి గంటసేపు బండి సంజయ్‌  ‌పాదయాత్ర చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page