లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హాలకు సిఎం రేవంత్ తూట్లు పొడిచారని విమర్శ
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్
దేవుళ్ళపై ఒట్లు వేసిన •రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతం రుణమాఫీ కూడా పూర్తి కాలేదని కిషన్ రెడ్డి తెలిపారు. రుణమాఫీపై పూర్తి వివరాలను ప్రజలు ముందు ప్రభుత్వం ఉంచా లన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రజా ఉద్యమాలకు సిద్ధం అవుతున్నామన్నారు. బీజేపీ.. వ్యక్తులు, కుటుంబాల కోసం నడిచే పార్టీ కాదని.. పండుగ వాతావరణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికార ంలోకి రావటమే బీజేపీ లక్ష్యమన్నారు. బీజేపీ అధికారిక ంలోకి రావాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ ముక్తి దివస్ ను ఘనంగా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వెల్లడిం చారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల స్పూర్తితో సభ్యత నమోదులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుటుంబాల కోసం అవినీతికి పాల్పడుతున్న పార్టీలను తరిమికొ డతామ న్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీని మించిన ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవా లన్నారు.