బీఅర్‌ఎస్‌ ‌తోనే ఆన్ని వర్గాల సంక్షేమం

ఆగం కావద్దు,అలోచించి ఓటు వేయాలి.. తెలంగాణా పై పెత్తనం చేయాలనీ చూస్తున్నారు.
వర్ధన్నపేట్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మంత్రి కెసిఆర్‌..

‌వర్థన్నపేట/ఎంజిఎం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28  : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తోనే తెలంగాణా లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ప్రజలు కల్లి బోల్లి మాటలు నమ్మకుండా మూడవసారి కూడా బీఆర్‌ఎస్‌ ‌కే ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్‌ అన్నారు.శుక్రవారం వర్ధన్నపేట నియోజక వర్గ ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చావు నోట్లో తల పెట్టి తెచ్చుకున్న రాష్ట్రంలోరెండు దఫాలుగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని దేశంలో మరెక్కడా లేని విధంగారైతు బంధు,దళితబందు,ఉచిత ఎరువులు,కరెంట్‌ ఇస్తున్నామని,50 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్‌ ‌పాలనలో కరెంట్‌ ఎరువులు లేక ఎంత గోస పడ్డామో తెలుసుని,కాంగ్రెస్‌ ‌నేతలు ధరణి తీసివేస్తామని ఉచిత కరెంట్‌ 3 ‌గంటలు సరి పోతుందని,రైతు బందు అనవసరంగా ఇస్తున్నారని మాట్లాడుతున్నారని మోసపోవద్దని ఆలోచించి ఒటువేయాలని సూంచిచారు.

వర్ధన్నపేట నియోజక వర్గ అభివృధి కి160 కోట్లు కేటాయించి అన్ని రకాలుగా అభివృధ్హి చేయడంలో ఎంఎల్‌ఏ ఆరూరి రమేష్‌ ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నాడని రెండు సార్లు అధిక మెజార్టీతో గెలిపిచుకున్నారని  మళ్ళి లక్ష మెజారిటీ తో గెలిపించుకోవాలని కోరారు,ఆరూరి పై గెలవలేని వారు రింగ్‌ ‌రోడ్‌ ‌ఫూలింగ్‌ ‌లో భూములు పోతాయని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు,నియోజకవర్గం లోని ఐనవోలు,హసన్పర్తి మండలలో ఎస్‌ఆర్‌ఎస్పి ద్వారా దేవాదుల నీరు పంట పొలాలకు అందించామనివిలీన గ్రామాలల్లో అభివ్రుదికి నిధులు ఇస్తామనిఎన్నికల తర్వాత సాదా బైనమ చేస్తామని హామీ ఇచ్చారు.అన్నివర్గాల విద్యార్థుల కోసం వెయ్యి రెసిడెన్షియల్‌ ‌పాటశాలలు ఏర్పాటు చేశామని,జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేశామని దేశంలో మరెక్కడా కూడాఇన్నికాలేజీలు లేవని తెలిపారు,ఎన్నికల తర్వాత రైతుబంధు క్రమంగా 5116లకు పెంచుతామని రైతుబంధు 16 వేలకు పెంచుతామని,వచ్చే మార్చినెల నుండి రేషన్కార్డు ఉన్నప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందిస్తామని,93 లక్షల కుటుంబాలకు ఉచిత భీమ ఇస్తామని తెలిపారు..భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.సభలో కేవలం కెసిఆర్‌ ‌మాత్రమే ప్రసంగించారు.

మహబుబాద్‌ ఆశీర్వాద సభ నుండి నేరుగా సబస్తలికి చేరుకున్న అయన ప్రసంగాని ప్రారంబించారు,అంతకు ముందు మాటలాడిన స్తానిక ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్‌ ‌కెసిఆర్‌ ‌దయ వల్లనే తనకు రెండు సార్లు ప్రజలకు సేవ చేసే అవకాశం లబించిందని ఆయన సహకారంతో నియోజక వర్గాన్ని అన్నిరకాలుగా అభివ్రుధి చేయడం జరిగిందని మరో సారి అవకాశం కలిపించాలని కోరారు. సభలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు, మాజీ ఎంఎల్సి కడియం శ్రీహరి, ఎంఎల్‌ఎ  ‌దాస్యం వినయ్‌భాస్కర్‌, ‌నన్నపునేని నరేందర్‌, ఎం‌పి పసునూరి దయాకర్‌, ‌బండప్రకాష్‌, ‌బస్వరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page