బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతల పరస్పర రాళ్ళ డాడి

తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి
ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతలు రాళ్ళ డాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ ‌ధర్నా చేస్తుండగా.. వారికి కౌంటర్‌గా సీఎం ప్లెక్సీకి కాంగ్రెస్‌ ‌నేతలు పాలాభిషేకం చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ ‌నేతలు కాంగ్రెస్‌ ‌నేతలను అడ్డుకున్నారు. మాట మాట పెరగడంతో ఇరు పార్టీ నేతలు దాడికి దిగారు. ఈ దాడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. దాడులకు పాల్పడిన వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. మరికొందరిని అదుపులో తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలను పరామర్శించేందుకు జగదీష్‌ ‌రెడ్డి బయలు దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి జగదీష్‌ ‌రెడ్డిని అడ్డుకున్నారు. తిరుమలగిరికి వెళ్లొద్దని జగదీష్‌ ‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

 

శాంతి భద్రతల సమస్య వొస్తుందని జగదీష్‌ ‌రెడ్డికి పోలీసుల విజ్ఞప్తి చేశారు. పోలీసుల సమక్షంలోనే తమ పార్టీ కార్యకర్తలపై దాడి జరిగిందనీ జగదీష్‌ ‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్‌ ‌చౌరస్తాలో ధర్నాలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుమలగిరి బీఆర్‌ఎస్‌ ‌శిబిరంపై కాంగ్రెస్‌ ‌దాడిని ఖండిస్తున్నామన్నారు. రేవంత్‌ ‌డైరెక్షన్‌ ‌లోనే బీఆర్‌ఎస్‌ ‌పై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కాంగ్రెస్‌ ‌చూస్తుందన్నారు. హావి•ల అమలు విఫలం కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ ‌మోసాలు బయటపడకుండా ఉండేందుకు హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే శిబిరాన్ని కూల్చివేశారని, కాంగ్రెసుతో కలిసి పోలీసులు పనిచేస్తిన్నట్లుగా ఉందన్నారు. రుణమాఫీపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన లేదన్నారు. చెయ్యని రుణమాఫీకి కాంగ్రెస్‌ ‌ప్రచారాలతో డంబాచారాలకు పోతుందన్నారు. రుణమాఫీపై రైతులు స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. స్వయానా మంత్రులే పూర్తిస్థాయిలో మాఫీ కాలేదని చెబుతున్నారని తెలిపారు. దాడులు చేసి రెచ్చగట్టాలని చూస్తున్నారన్నారు. ఎన్ని దాడులు చేసినా ప్రజల కోసం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఎన్ని దాడులు చేసినా  పోరాటం ఆగదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page