బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల బతుకులు ఆగం చేసింది  

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 20: షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామ భూ బాధితులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీం భరత్ కలిసి తమ యొక్క భూములను లాక్కొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడా కంపెనీలకు కట్టబెట్టి అధికారులు రైతుల బతుకులను ఆగం చేసినారని భూ బాధితులు తమ గోడును భీమ్ భరత్ కు తెలిపారు.
భూబాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులతో కుమ్మకై గ్రామపంచాయతీ నుండి మంత్రివర్గం వరకు బీఆర్ఎస్ నాయకులు ముడుపులు అందుకని తమ బతుకులు ఆగం చేశారని రైతులు ఆరోపించారు.ఈ విషయంపై ఆర్డిఓ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ కు వివరించిన ఫలితం లేకుండా పోయిందని,హైతాబాద్ చౌరస్తాలలో 40 రోజులపాటు నిరాహార దీక్ష చేస్తే ముడుపులు అందుకున్న నాయకులు రాత్రికి రాత్రే దీక్ష శిబిరాన్ని తొలగించి రైతులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు.పట్టు విడవని రైతులకు ఫలితం లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురైనారన్నారు.రాహుల్ గాంధీ తల పెట్టిన భారత్ జోడోయాత్రలో భాగంగా అప్పటి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క భారత్ జూడో యాత్రలో భాగంగా షాబాద్ మండలం హైతాబాద్ చౌరాస్తాలో చందనవెళ్లి భూ నిర్వాసితులు కలిసి 2000 ఎకరాలు భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని జరిగిన అన్యాయం గురించి బట్టి విక్రమార్క వివరించామని తెలిపారు.బట్టి విక్రమార్క స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తగిన న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా తమకు న్యాయం చేయాలని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీం భరత్ చందనవెళ్లి భూభాదితులు వేమారెడ్డి,చేవెళ్ల స్వామి, రామచంద్రయ్య,సలీం,సత్తయ్య, కిష్టయ్య,నర్సింలు,మల్లయ్య, శ్రీనివాస్ శోభ,ఇంద్రమ్మ,లక్ష్మమ్మ, రైతులు కలిశారు.భీం భరత్ మాట్లాడుతూ భూమి లేని నిరుపేదలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల వారికి భూములు పంచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు భూములకు గౌటాన్ భూములకు లావన్ భూములకు పట్టాలిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు.మాట తప్పకుండా అమలు చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page