బీజేపీ అధికారం లోకి వొస్తుంది..

 ఖమ్మం ‘ రైతు గోస – బీజేపీ భరోసా’ బహిరంగ సభలో
కేంద్ర మంత్రి అమిత్ షా
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. మోదీ ని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి..అని బీజేపీ అగ్ర నాయకుడు,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఖమ్మం లో ఆదివారం రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన ‘ రైతు గోస – బీజేపీ  భరోసా’ బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా తిరుపతి వెంకటేశ్వర స్వామికి,  స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి నమస్కారములు చేస్తూ  తెలంగాణ విమోచనకోసం పోరాడిన సర్దార జమాపురం కేశవరావుగారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అన్నారు. ఈ 75 ఏళ్ల వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రం లో
 అక్రమ, అవినీతి, కుటుంబ పాలకులు, రజాకార్ల మద్దతుతో కొనసాగుతున్న కల్వకుంట్ల ప్రభుత్వానికి తిరోగమనం మొదలైందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చాను..అని తెలిపారు. తెలంగాణ విమోచన సంగ్రామంలో నాటి తెలంగాణ యువత ప్రాణత్యాగం చేశారు. కానీ మీరు 9 ఏళ్లుగా రజాకార్ల పార్టీతో అంటకాగుతూ.. నాటి ప్రజల త్యాగాలకు విలువలేకుండా చేశారు అని బీ ఆర్ ఎస్ పార్టీ నుద్దేశించి అమిత్ షా అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి.. కేసీఆర్ ఓడుతున్నాడు.. బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి రానుంది అని అన్నారు. భద్రాచలానికి దక్షిణభారతపు అయోధ్యగా పేరుంది..17వ శతాబ్దం నుంచి తెలంగాణలో ఎవరు పాలించినా.. రామనమవి  నాడు..  ప్రభుత్వం తరపున భద్రాచలం రాముడి కల్యాణ రాముడికి వస్త్రాలు సమర్పించడం ఓ ఆనవాయితీగా వస్తోంది..కానీ కేసీఆర్.. ప్రభుత్వంలో మాత్రం.. కారు..భద్రాచలం వరకు వస్తుంది. కానీ మందిరంలోకి కారు వెళ్లకుండా.. ఆగుతోంది..
ఎందుకంటే మందిరంలోకి వెళ్తే మిత్రుడికి బాధ కలుగుతుందనే ఆలోచన కేసీఆర్ ది అని పేర్కొంటూ
 ఇక ఆయన పని అయిపోయింది అని తెలిపారు. నరేంద్రమోదీ  ఆశీస్సులతో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. అందులో సందేహం లేదు..అని తెలుపుతూ..మా సీఎం ఎవరున్నా.. కమల పుష్పాన్ని భద్రాచల రాముడి పాదపద్మముల ముందు అర్పిస్తాం..అని అన్నారు. బీజేపీ నేతలమీద దౌర్జన్యాలు, అక్రమ నిర్బంధాలు చేస్తే, బెదిరింపులకు గురిచేస్తే.. వాళ్లు వెనక్కు తగ్గుతారని అనుకుంటున్నారు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్ ను,  ఈటల ని అడ్డుకుంటే.. మేం వెనక్కు తగ్గం….ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.కేసీఆర్  కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు..అని పేర్కొంటూ..కాంగ్రెస్ పార్టీ 4జీ పార్టీ..బీఆర్ఎస్ పార్టీ.. 2జీ పార్టీ…మజ్లిస్ పార్టీ.. 3 జీ పార్టీ..
ఇప్పుడు ఈ 2జీ, 3జీ, 4జీ పార్టీలకు కాలం చెల్లింది. తెలంగాణలో వచ్చేది బీజేపి పార్టీయే అని అమిత్ షా అన్నారు. కేసీఅర్ అబద్ధపు హామీలు ఇవ్వడం తప్ప కాలం వెల్లదీస్తున్నాడు కానీ పేదలకు ఏమీ చేయడం లేదు అన్నారు.కేసీఆర్ ను ఇంటికి పంపి.. బీజేపీని అధికారంలోకి తీసుకొద్దాం అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page