బీసీలకు మద్దతు ఇచ్చే వారికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 4: బీసీల సంక్షేమానికి మద్దతు ఇచ్చేవారికి బీసీ సంఘం మద్దతు ఉంటుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్ కుమార్ స్థానిక బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మరియు సంఘం నేతలతో పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేపట్టని విధంగా రూ. రెండు కోట్లతో రెండు ఎకరాల్లో బీసీ సంక్షేమ భవనం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు ఈ భవనంలో నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు నిర్వహించేందుకు చూపిన శ్రద్ధ బీసీలను ఆకర్షించిందన్నారు. అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచే విషయంలో తమకు మద్దతు ఇస్తామని తెలియజేయడం పట్ల తాండూర్ లో రోహిత్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా బిసి లకు మద్దతుగా నిలబడే వారికి ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇస్తుందని అన్నారు తాండూరు వచ్చిన సందర్భంగా ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్ కుమార్ ను తాండూరు బీసీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీశైలం రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజ్ కుమార్, సయ్యద్ శుకుర్ వెంకటేష్ రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page