హస్తం గూటికి ఇల్లందు మున్సిపల్ చైర్మన్
కారులో భారీ కుదుపులు
తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
అదే బాటలో ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, వార్డు సభ్యులు
ఇల్లందు : భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియకు బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఊహించని షాక్ ఇచ్చారు. అసమ్మతినేత మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన అనుచర కౌన్సిలర్లు అంకపాక నవీన్, మొగిలి,లక్ష్మి,, వార రవి, కోఆప్షన్ సభ్యురాలు నాగమణి లతోపాటు పలువురు కాంగ్రెస్ అభ్యర్థి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య నేతృత్వంలో తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇదే బాటలో మండల ఎంపీపీ చీమల నాగరత్నమ్మ పలువురు ఎంపీటీసీలు సర్పంచులు వార్డు సభ్యులు ఈరోజు ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి సమక్షంలో చైర్మన్ ఉన్నట్లు తెలిపారు. వలసిన పరువు పెరగడంతో బిఆర్ఎస్ గండిని కూర్చో పరిస్థితి లేక తీవ్ర ఆందోళనలో పార్టీ క్యాడర్ తో పాటు ఎమ్మెల్యే హరిప్రియ సైతం కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తుంది.