భర్త వీర్య సేకరణకు అనుమతి

కేరళలో అరుదైన తీర్పునిచ్చిన కోర్టు

తిరువనంతపురం,ఆగస్ట్21(ఆర్‌ఎన్‌ఎ): ‌భర్త వీర్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవచ్చని కేరళ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా సంచలన  తీర్పునిచ్చింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టా డుతున్న తన భర్త విషయ ంలో ఓ భార్య అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేసు పూర్వా పరాల్లోకి వెళ్తే.. కేరళలో కొన్ని రోజుల క్రితం భర్త తీవ్ర అనారోగ్యానికి గుర య్యారు. భర్త ఆరోగ్యంపట్ల కలత చెందిన భార్య.. సంతానానికీ నోచు కోలేదని బాధపడేది. ఈ క్రమంలో భర్త ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. భర్త ప్రస్తుతం ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందు తున్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్త నుంచి సంతానాన్ని పొందేందుకు ఆయన వీర్య కణాలు భద్రపరచాలని ఆమె నిర్ణయిం చుకుంది. అయితే దానికి న్యాయ స్థానం అనుమతి తప్పనిసరి అని తెలియడంతో కోర్టులో పిటిషన్‌ ‌వేసింది. భార్య పిటిషన్‌పై విచారించిన న్యాయ స్థానం బుధవారం తీర్పు వెలువ రించింది. కేసు విచారణ సందర్భంగా భార్య మాట్లాడుతూ. తన భర్త పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం ఆయన స్ప•హలో లేరని అందుకే రాతపూర్వక సమ్మతి తీసుకురాలేదని కోర్టుకి తెలి పింది. తనకు ఇప్పటివరకు సంతానం కలగలేదని.. భవిష్యత్తులో నైనా పొందే ందుకు తన భర్త వీర్యాన్ని భద్రపర చడానికి అనుమతించాలని కోర్టు ను కోరింది.

చావుబతుకుల మధ్య ఆయన కొట్టుమిట్టాడుతున్నాడని.. ఆల స్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారి అతను మరణించే ప్రమాద ముందని.. వెంటనే న్యాయం చేయాలని కోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పిటిషన్‌పై విచారించిన జస్టిస్‌ ‌వి.జి. అరుణ్‌తో కూడిన ధర్మాసనం సానుకూల తీర్పు వెలువరించింది. భర్త నుంచి వీర్యం సేకరించి, భద్రపరచడానికి వైద్యులకు అనుమతించింది. అయితే వీర్యం సేకరణ మినహా వేరే ఏదీ చేయవద్దని వైద్యులకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 9‌కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page