భారత్ జోడో యాత్ర కు మూడు రోజులు విరామం
27న ఉదయం పున ప్రారంభ
మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం మొదటిరోజు తెలంగాణ రాష్ట్రా లో ప్రారంభమైంది కృష్ణ మండలం బ్రిడ్జి వద్ద నుండి ప్రారంభమైన యాత్ర థైరోడ్ వరకు నాలుగు కిలోమీటర్లు కొనసాగి అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా శంషాబాద్ కు రాహుల్ గాంధీ చేరుకున్నారు.
శంషాబాద్ నుండి ప్రత్యేక విమానంలో దిల్లీకి ప్రయాణమయ్యారు. 23వ తేదీన ప్రారంభమైన భారత్ జూడో యాత్ర 24, 25, 26 మూడు రోజులు విరామం ఉంటుందని తిరిగి 27వ తేదీన మక్తల్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ నుండి ప్రారంభం అవుతుందని.. రాహుల్ గాంధీ 26వ తేదీన రాత్రికి మక్తల్ పట్టణానికి చేరుకోనున్నట్లు సమాచారం. తిరిగి 27వ తేదీన ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమై ముందు తెలిపిన విధంగా యాత్ర మ్యాప్ రూట్ ప్రకారం దేవరకద్ర మీదుగా చేరుకొని మహబూబ్ నగర్ మీదుగా యాత్ర కొనసాగనుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.