- లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే యన్నం, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
- ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: గతరెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అటువంటి భారీ వర్షాల కారణంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం జిల్లా కేంద్రంలో ఆదివారం 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నిరంతర వర్షం కారణంగా నీళ్లు కాలనీలు ఇండ్లలోకి చేరాయి. వాగులు వంకలు నీటితో పొంగిపొర్లాయి. కొన్ని ప్రాంతాల్లో పాత ఇండ్లు మట్టిమిద్దలు కూలిపోయాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. జిల్లా కేంద్రంలో కురివినిశెట్టి కాలనీ ఎర్రగుంట లక్ష్మీ నగర్ కొత్తచెరువు తదితర ప్రాంతాల్లో భారీ వర్షంలోనూ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ లు కాలనీలు తిరిగి పరిశీలించారు. నిరంతర వర్ష ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా సంబంధిత అధికార యంత్రాంగం తో సిబ్బందితో సూచనలు చేస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ప్రమాదాలు జరగకుండా చూశారు.
ప్రజలు ఎవరు అధైర్యం చెందవద్దని ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసాని ఇచ్చారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలకు తెలియజేశారు. ఇబ్బంది పరిస్థితులు ఉన్నచోట ఈ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తే తక్షణమే సహకార చర్యలు చేపడతామని తెలిపారు. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం మరో 36 గంటలు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మహబూబ్ నగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగిందని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లరాదని సూచించారు. నియోజకవర్గ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు అలాగే సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అలర్ట్ గా ఉండాలని తెలిపారు. పాత శిథిలావస్థలో ఉన్న భవనంలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి నిత్యవసర వస్తువులను భోజన సదుపాయాలను కల్పించారు.
మట్టి మిద్దె కూలిన వారికి నష్టపరిహారంగా 95,100 నగదు సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో భారీ వర్షాల కారణంగా సమస్యలు లేకుండా చూసేందుకు ప్రణాళిక రూపొందించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పట్టణంలో ఉన్న మినీ ట్యాంక్బండ్ కు వెళ్లి చెరువులో ఉన్న నీటి పరిస్థితిని పరిశీలించారు. నువ్వు తట్టు ప్రాంతంలో నుండి ఇండ్లలోకి వస్తున్న నీరు ను పరిశీలించారు. సమస్యను పరిష్కారం చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడారు. బోయపల్లి అలుగు నుండి పారుతున్న నీరు పట్టణంలోకి వస్తున్న పరిస్థితిలపై పట్టణంలో ఆటోలో మైకుల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయాలని సూచించారు. సమస్యలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు వినోద్ సిరాజ్ కాద్రి లక్ష్మణ్ యాదవ్ పట్టణంలోని పలు వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.