భావి సారథి

అంతరంగం అంతు చిక్కని
అనంత పారావారమై,
బంధాలకు,అనుబంధాలకు
నెలవైన నెలత,
ఆత్మీయతానురాగాలనందించే
అమృతకలశం.

ఆమె…
కుటుంబసభ్యుల సేవలో
రేయింబవళ్లను ఒకటిగా చేసి,
వారిని జాగృతంచేసే
చైతన్యకిరణం,
ఆశయాల తీరం చేర్చే నావ,
తలపుల వినీలాకాశంలో
స్వేచ్ఛగా విహరింపచేసే విహంగం.

నవ్యచరితలు లిఖించుటకై
ద్విగుణీకృతమైన పట్టుదలతో,
మొక్కవోని దీక్షతో,
సర్వం తానై, సకలానికి నెలవై,
విశ్వవిపంచిjైు
నిశ్శబ్దాన్ని చీల్చుతూ,
అన్నింటా తానేనంటూ
అఖిలానికి నేనేనంటూ,
తన గెలుపు చాటుతూ,
సవ్యసాచిjైు,
అనంత జీవనవాహినిjైు
జగతిప్రగతికి దిశగా,దశగా
సాగుతోన్న ఈ మమతల పేటిక
రేపటి జగన్నౌకకు చుక్కాని.

  -వేమూరి శ్రీనివాస్‌  తాడేపల్లిగూడెం, 9912128967         

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page