బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
ఇక కుంతీదేవి ఏమీ మాట్లాడలేక ఇలాచెప్పింది. ‘నాచిన్నప్పుడు ఒక మహాముని నాకోవరం ఇచ్చాడు. ఆ వరంతో నేను దేవతలను ఆహ్వానించి, వారి వలన సంతానాన్ని కనగలను అంది. పాండురాజు అందుకు సరే అన్నాడు. కుంతీదేవి యమధర్మరాజును ఉపాసించి ధర్మరాజునూ, వాయు దేవుని ఆహ్వానించి భీమసేనుడినీ, ఇంద్రుని పిలిచి అర్జునుడినీ కంది. పాండురాజు ఆనందానికి హద్దులేవు. అక్కడ ధృతరాష్ట్రుడి ప్రేమకు చిహ్నంగా గాంధారి గర్భవతి అయింది. నెలలు గడుస్తూవున్నాయి. కుంతికి పిల్లలు పుట్టారన్న వార్తను విన్న గాంధారికి దఃఖం ఆగలేదు. తన కడుపుమీద కొట్టుకుంటూ ఏడ్చింది. ఆ దెబ్బలకు ఆమె గర్భంనుండి పిండం బయటపడింది. ఆమె బాధ వర్ణనాతీతం. అప్పుడు వ్యాసమహర్షి వచ్చి ఆ పిండాన్ని 101 ముక్కలుగా చేసి వేరు వేరుగా నేతి కుండలలో ఉంచి, చల్లటి నీతితో తడుపుతూ ఉండమన్నాడు. రెండు సంవత్సరాల పాటు అలా చేయగా వాటి నుండి శిశువులు బయలు దేరాయి.
అక్కడ కుంతీభీమసేనుణ్ణి టున్న సమయంలోనే ఇక్కడ దుర్యోదనుడు పుట్టాడు. వాడు పుడుతూనే గాడిదలాగా ఓండ్రపెట్టాడట. పెను గాలులు వీచాయట. దుర్నిమిత్తములు అనేకం కలిగాయట. ధృతరాష్ట్రుడు పెద్దలను రావించి వారిని సంప్రదించగా వారంతా వీడు వంశనాశకుడు కాగలడని చెప్పి వాడిని విడిచి పెడితే ఆ ప్రమాదం తప్పుతుందని సలహానిచ్చాడు. వంశశ్రేయస్సు కోసం వ్యక్తినీ, గ్రామ క్షేమం కోసం ఒక గ్రామాన్నీ ఆత్మాభ్యుదయానికి ప్రపంచాన్నీ విసర్జించడం మంచిదని ధర్మశాస్త్రం చెబుతున్నదన్నారు.
ధృతరాష్ట్రుడికి సంతానం మీదవున్న మమకారం వలన వారి మాటలు వినలేదు. గాంధారి గర్భవతిగా ఉండగా ధృతరాష్ట్రుడు, ఆయన సేవలో ఉన్న మహిళతో యుయుత్సుడనే పుత్రుని కన్నాడు. దుర్యోధనుడి తర్వాత రాజుకు ఒకరుగా దుశ్శాసనాది కుమారులూ, దుస్సల అనే కుమార్తె పుట్టాడు.
వారి పేర్లు ఇవి దుర్యోదన, యుయుత్సు, దుశ్శాసన, దుస్సహ, దుర్ముఖ, వివింశతి, వికర్ణ జలసంధ, సులోచన, వింద, అనువిద, దుర్ధర్ష, సుబాహు, దుష్ట్రకర్ణణ, దుష్కర్ణ కర్ణ శల, చిత్ర, ఉపచిత్ర, చిత్రాక్ష, చారుచిత్ర, చిత్రాంగద, దుర్మద దుష్ట్రధర్ష, దుర్విగాహ, వివిత్స, వికట, ఊర్ణనాభ, సునాభ, సత్వ, సమ, నంద, ఉప నంద, చిత్రబాణ, చిత్రవర్మ, సువర్మ, దుర్విరోచన, అయోబాహు, మహాబహు, చిత్రాంగ, చిత్రకుండల, భీమవేగ, భీమబల, బలాకి, బలవర్ధన, ఉగ్రాయుధ, సుషేణ, కుండోధర, మహోదర, చిత్రాయుధ, విషంగి, పాశి, వృందారక, ధృడవర్మ, ధృడక్షత్ర, సోమకీర్తి, అనూదర, ధృడసంధ, జరాసంధ, సత్ససంధ, సువాక్కు, ఉగ్రశ్రవ, ఉగ్రసేన, సేనాని, దుష్ట రాజయ, అపరాజిత, పండితక, విశాలక్ష, దురాధర, దృడహస్త, సువాస్త, వాతవేగ, సువర్చస, ఆదిత్యకేతు, జిహ్వాశి, నాగదత్త, అగ్రయాయి, కవచి, క్రధన, దండి, దండధారి, ధనుర్గ్రహ, ఉగ్రభీమరధ, వీర, వీరబాహు, అలోలుప, అభయ, రౌద్రకర్మ, దృఢరధాశ్రయ, అనాధృష్య, కుండభేది, విరావి, చిత్రకుండల, ప్రమధ, ప్రమాధి, దీర్ఘరోమ, వీర్యవంత, దీర్ఘబాహు, మహాబహు, వ్యూడోరు, కనకధ్వజ, కుండాశి, విరోజ, దుశ్శల.
(తరువాయి..వొచ్చే సంచికలో)