ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 12; చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండల పరిధిలోని గల చందనవెల్లి భూ నిర్వాసితుల బాధితుల సమష్యాల పరిష్కారానికి వచ్చిన జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి చందనవెల్లి హైతాబాద్ గ్రామాలలోని భూములను కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే విదంగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామని రైతులకు అండగా ఉంటామని అన్నారు.టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు పామెనా భీం భరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభివృధికోసం దొరల రజాకార్ల నవాబుల పాలనా నుండి విముక్తి పొంది తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు కనీసం సమాజంలో గౌరవంగా బతకాలని కడుపు నిండా ఒక్కపూట తిండి తినాలన్న భూమి కావాలి పంటలు సాగు చేసుకొని జీవనోపాధి పొంది కుడు గూడు గుడ్డ సమాకుర్చుకొని జీవిస్తారని తమ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ప్రభుత్వ భూములను రాష్ట్రంలోని అన్ని పేద వర్గాలకు చెందిన నిరుపేదలకు భూ పంపిణి చేశారు అని భీమ్ భరత్ అన్నారు.అలాగే చందనవెల్లి హైతాబాద్ మాచన్‌పల్లి సోలిపేట గ్రామాలకు రెండువేల(2000) ఎకరాల భూములు నిరు పేదలకు పంపిణి చేశారు అన్నారు.ప్రస్తుతం తెలంగాణ రాష్టంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల భూములు గుంజుకొని పెద్ద పెద్ద కంపెనీలకు అమ్ముకొని బడా బాబులు జేబులు నింపుకుంటున్నారు అని భీమ్ భారత్ అన్నారు.నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భూములను కోల్పోయిన రైతులకు పరిహారం వచ్చేవరకు పోరాడుతమని తెలిపారు.ఈ కార్యక్రమంలంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నర్సింహారెడ్డి,టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వాహన సభ్యులు పామెనా భీం భరత్,టీపీసీసీ ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి,రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి,హైకోర్ట్ అడ్వకేట్ మల్లరెడ్డి,టీపీసీసీ కార్యదర్శి సురేందర్ రెడ్డి,రామ్ రెడ్డి,టీపీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్,సున్నం వసంతం,టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్,మాజీ డీసీసీ అధ్యక్షులు పడాల వెంకటస్వామి, చేవెళ్ల సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి,మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు మధుసుధన్ గుప్త,మొయినాబాద్ పిఏసిఎస్ చైర్మన్ చంద్ర రెడ్డి,జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు రామ్ రెడ్డి,షాబాద్ మండలం పార్టీ అధ్యక్షులు కావాలి చంద్రశేఖర్,చేవెళ్ల మండలం పార్టీ అధ్యక్షులు వీరందర్ రెడ్డి, మొయినాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తమ్మాలి మనయ్య, ఎంపీటీసీ చెన్నయ్య,చేవెళ్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరెడ్డి,డీసీసీ ప్రధాన కార్యదర్శి భార్గవ రామ్,మీర్ పేట్ కార్పొరేటర్ బల్ రెడ్డి,మాజీ సర్పంచ్ బర్ల యాదయ్య,డీసీసీ ప్రధాన కార్యదర్శి పెంటయ్య గౌడ్, మహేందర్,రైతులు ఆంజనేయులు,శోభ,చందానవెల్లి గ్రామ రైతులు తదితరులు ఉన్నారు.