మండుతున్న కూరగాయల ధరలు

రోజురోజుకు కూరగాయల ధరలు మండుతున్నాయి. వేసవికాలంలో ఎండలు ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతను ఈ సంవత్సరం చూశాం.ఇప్పుడిప్పుడే ఎండలు తగ్గి చల్లబడుతుందన్నటువంటి తరుణంలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలను మంట నేక్కిస్తున్నాయి.మామూలుగా అయితే వేసవిలో కూరగాయల ధరలు పెరగడం వర్షాకాలం రాగానే తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు అది దానికి విరుద్ధంగా ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే ఉన్నా వర్షాకాలంలో మాత్రం అమాంతంగా పెరిగాయి. కూరగాయలు కిలో కి దాదాపు రూ. 80 నుండి రూ.100 వరకు పలుకుతున్నాయి.కేవలం 15 రోజుల వ్యవధిలోనే కొండెక్కి కూర్చున్నాయి. ఉల్లి, టమాటా సహా అన్ని కూరగాయల ధరలు 60 శాతం పెరిగాయి.మే నెలలో ఉల్లి కిలో రూ.20 ఉంటే ఇప్పుడు రూ.50 కి చేరింది. వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, బీరకాయ,దొండ,గోరు చిక్కుడు, చిక్కుడు,బీన్స్,క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం వంటివి కూడా అమాంతం పెరిగాయి.2024 మే నెలలో ఆహార పదార్థాలు,ఆహార ఉత్పత్తుల తయారీ,ముడిచమురు, సహజవాయువు,నూనెల ధరలు అమాంతం పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇవే కాకుండా ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి.

డిమాండ్ కు తగ్గట్టుగా సరిపడా ఆకుకూరలు మార్కెట్లోకి రాక ధర భారీగా పెరిగిందని చెప్పొచ్చు.మన రాష్ట్రంలో జనాభాకు ప్రతి ఏడాది 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరమారుతాయి.ప్రస్తుతం 19.54 లక్షల టన్నుల మాత్రమే ఉత్పత్తి అవుతుందని అంచనా. రాష్ట్రంలో ఒకటి పాయింట్ 30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతున్నాయి అందులో కూరగాయలు పంటలు గనుక చూస్తే 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి ఈ కారణంగా జనాభా అవసరాలకు సుమారుగా 19 లక్షల టన్నుల దిగిబడి కోసం మనం ఇతర రాష్ట్రాల పైన ఆధారపడాల్సి ఉంటుంది. నిత్యవసర ధరలు వారిపై అదనపు భారాన్ని కూడా మోపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. దిగుబడి లేకపోవడంతో రేట్లు పెరుగుతున్నాయని అంటున్నారు కూరగాయల వ్యాపారం చేసేవారు. వర్షాలు సరిగా పడకపోవడంతో దిగుబడి తగ్గింది. ఈ ధరలు అమాంతం గా పెరిగాయి. రూ.10 ఉన్నవి రూ.20,రూ. 20 ఉన్నవి రూ.40, రూ.40 ఉన్నాయి కాస్త రూ.80కి చేరుకున్నాయి.

మార్కెట్లో కేజీ బీరకాయ, చిక్కుడు క్యారెట్ వంటివి రూ.100కు పైనే ఉన్నాయి. ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి వంటింట్లో తప్పనిసరైన ఉల్లిగాటు కన్నీరు తెప్పిస్తుంది. టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. వర్షాలు సకాలంలో పడక వర్షాకాలంలో కొత్త పంట వేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడటం వల్ల దిగుమతి కూడా తగ్గింది. సీజనల్ కూరగాయలు కాకపోవడంతో కూడా ధరలు అమాంతంగా పెరిగాయి వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి దిగుబడి తక్కువగా ఉండడంతో కూడా కూరగాయల ధరలు పెరుగుదలకు కారణం. రూ. 500 తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు తీసుకువచ్చే పరిస్థితి ఇది వరకు ఉంటే, ఇప్పుడు చేతినిండా డబ్బులు తీసుకెళ్లిన సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదు అంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కూడా ముందస్తు ప్రణాళిక ప్రకారం కూరగాయలు పండిస్తేనే సామాన్యులకు ధరలు అందుబాటులో ఉంటాయి. లేకపోతే ధరలను చూసి సామాన్య జనం బెంబేలెత్తవలసిన పరిస్థితి ఉంటుంది.

– మోటె చిరంజీవి,సెల్ : 9949194327.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page