కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 16 : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం జైత్వారం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఆమె నివాసంలో బిఆర్ఎస్ లో చేరారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.వారందరికీ గులాబీ కండువాలు కప్పి మంత్రి సాదరంగాపార్టీలోకిఆహ్వానించారు. .తనపై ఎంతో నమ్మకంతో బిఆర్ఎస్ లో చేరుతున్న వారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరి ఆశయాలు,ఆకాంక్షలకు అనుగుణంగా మరింత బాధ్యతతో పనిచేస్తానన్నారు.జైత్వారం గ్రామ సర్పంచ్ సదాలక్ష్మీ పుల్లారెడ్డి,సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బక్క యాదయ్య,మాజీ సర్పంచ్ పర్వతాలు యాదవ్,మాజీ సర్పంచ్ పోసరాల మహేందర్,మాజీ ఉపసర్పంచ్ శ్రీశైలం ముదిరాజ్,మాజీ రైతు సంఘం అధ్యక్షులు పళ్ళ శేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు మహేందర్,పొద్దుటూరు బోసిరెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ శేరిగూడ అంజయ్య,ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డేరంగుల వెంకటరమణ,సంపంగి కుమార్,సంపంగి మహేందర్,ఓట్స్ శంకర్,జంగని రేవంత్, పొట్టి యాదగిరి,బీఆర్ఎస్ పార్టీ తీర్థం తీసుకున్నారు.పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి కందుకూరు మండలం జడ్పిటిసి బొక్క జంగారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సురసాని సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మన్నే జయేందర్ ముదిరాజ్ లకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.