కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1 :మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం కందుకూరు లేమూరు,దెబ్బడ గూడ,బాచుపల్లి గ్రామాల కాంగ్రెస్ బిజెపి పార్టీలకు చెందిన 150 మంది తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు పి.సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.మంత్రి అందరికీ సాధారణంగా కండువాలు కప్పారు.పార్టీ అనేది ముఖ్యం కాదు అభివృద్ధి ముఖ్యం,మహేశ్వరం నియోజకవర్గంలో కొట్లాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే సత్తా అది కేవలం సబితా ఇంద్రారెడ్డి తోనే సాధ్యమని భావించి నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.యువజన విభాగం అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్ మాట్లాడుతూ,మహేశ్వరంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారే అన్నా చందంగా ఉందని,పార్టీలో తనకు సముచిత న్యాయం ఇవ్వట్లేదు అని భావించి సబితా ఇంద్రారెడ్డి అన్ని కులాలను,అన్ని మతాలను కలుపుతూ ఒకే తాటిపై తీసుకువచ్చి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.గతంలో ఆమె అడుగు జాడలో నడవడం జరిగిందని మళ్లీ మరింత అభివృద్ధికి ఆకాంక్షిస్తూ కేవలం సబితా ఇంద్రారెడ్డితోనే సాధ్యమని భావించి నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాదేశిక సభ్యుడు జంగారెడ్డి,మార్కెట్ కమిటి చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ చంద్రశేఖర్,వైస్ చైర్మన్ విజెందర్ రెడ్డి,కందుకూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన్నే జయేందర్ ముదిరాజ్,విగ్నేశ్వర్ రెడ్డి,యువజన విభాగం నాయకుడు తాళ్ల కార్తీక్,దీక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.