మంత్రులతో సీఎం కేసీఆర్‌ ‌భేటీ

  • కేంద్ర మంత్రితో చర్చల వివరాలు వెల్లడించిన మంత్రులు
  • సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ ‌దిల్లీ వెళ్లి వొచ్చిన మంత్రులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో రాష్ట్ర మంత్రులు నిరంజన్‌ ‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ‌పువ్వాడ అజయ్‌ ‌సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తెలంగాణ ప్రభుత్వం పట్ల పరుష పదజాలాన్ని వాడారనీ, రైతులను కేంద్రంపైకి రెచ్చగొడుతూ వారిని మోసం చేస్తున్నారని విమర్శించిన విషయాన్ని వారు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

పంజాబ్‌ ‌మాదిరిగానే దేశంలోని మిగతా రాష్ట్రాలలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడంపై సీఎం కేసీఆర్‌ ‌మంత్రులతో జరిగిన సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై సీఎం మంత్రులతో చర్చించినట్లు తెలిసింది.

సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్‌
‌నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ ‌శుక్రవారం పరిశీలించారు. సచివాలయ నిర్మాణానికి చేపట్టిన కాంట్రాక్టు సంస్థను వివరాలు అడిగి తెలుసుకుని, పనుల పురోగతిని పరిశీలించారు. నూతన భవనం ఎంత వరకు పూర్తయిందని ప్రశ్నించి నిర్దేశిత గడువు లోగానే కట్టడం నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు సీఎం కేసీఆర్‌ ‌స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page