సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని తద్వారా చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని సిద్దిపేట్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, ఆర్.సి. పురం వారు రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూల, సహజ రంగులు ఉపయోగించి తయారు చేసిన మట్టి విగ్రహాలని పూజించాలి అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించుట కొరకు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి,పర్యావరణ శాస్త్రవేత్త రవీందర్, కాలుష్య నియంత్రణ మండలి, ఆర్.సి. పురం, జిల్లా అధికారులు పాల్గొన్నారు..