పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 22: మతతత్వమే ఎజెండాగా పనిచేస్తున్న బిజెపి పార్టీకి తెలంగాణలో స్థానం లేదని, అంగట్లో సరుకులా ఎమ్మెల్యేల టికెట్లు అమ్ముకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు.
భారతీ నగర్ డివిజన్ పరిధిలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షులు కోటే శంకర్, భారతి నగర్ డివిజన్ అధ్యక్షులు మన్నె శ్రీకాంత్, జిన్నారం మండల అధ్యక్షుడు బండి శ్రీకాంత్ తదితరులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి మొండి చేయి చూపిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని విమర్శించారు. నాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేటాయించకుండా అభివృద్ధి నిరోధకులుగా మారారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.