మరోమారు సిఎం కెసిఆర్‌తో తమిళి ‘సై ‘..!

  • నేడు భద్రాచలంలో పర్యటనకు రానున్న గవర్నర్‌
  • ఏరియల్‌ ‌సర్వే చేపట్టనున్న సిఎం కెసిఆర్‌

‌హైరదాబాద్‌,‌జూలై16:తెలంగాణలో భారీ వర్షాలు కురియడంతో పలు జిల్లాల్లో వరద ధాటికి భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమమం అయ్యాయి. ఇక, గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో ప్రవహిస్తుండటంతో భద్రాచలం నీట ముగినింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదివారం ఏరియల్‌ ‌స్వరే చేపట్టనున్నారు. ఈ సందర్బంగా వరద ముంపు ప్రాంతాలను సీఎం కేసీఆర్‌ ‌పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌భద్రాచలానికి వెళ్లనున్నారు. వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను పరశీలించనున్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్‌ ‌నుంచి రైలులో గవర్నర్‌ ‌తమిళిసై.. భద్రాచలానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయానికి భద్రాచలం చేరుకోనున్నారు. గోదారమ్మ మహోగ్ర స్వరూపంతో.. భదాద్రి వణికిపోతోంది. వరదలతో అతలాకుతలమవుతోన్న జిల్లాలో రేపు గవర్నర్‌ ‌తమిళిసైతో పాటు సీఎం కేసీఆర్‌ ‌వేర్వేరుగా పర్యటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళిసై.. భద్రాచలంలోని వరద బాధితులను కలుసుకోనుండగా.. సీఎం కేసీఆర్‌ ‌గోదావరి ప్రభావిత ప్రాంతాలను ఏరియల్‌ ‌సర్వే చేయనున్నారు.గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌.. ‌రేపు భదాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు.

వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. గోదావరి వరద కారణంగా జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్‌ ‌మాట్లాడ నున్నారు. ఈరోజు.. దిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇచ్చే విందులకు గవర్నర్‌ ‌హాజరుకావాల్సి ఉండగా.. భద్రాచలం పర్యటన నేపథ్యంలో ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. మరోవైరు… గోదావరి పరివాహక ప్రాంతాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రేపు ఉదయం ఏరియల్‌ ‌సర్వే చేయనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృత్తి విపత్తు, గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదలపై సవి•క్షించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో సీఎం ఏరియల్‌ ‌సర్వే కొనసాగనుంది.

ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌? ‌కుమార్‌ ఈ ‌సర్వేలో పాల్గొననున్నారు. సీఎం చేపట్టే ఏరియల్‌ ‌సర్వేకు సంబంధించిన హెలికాప్టర్‌ ‌రూటుమ్యాప్‌ ‌సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాను సారం గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన వైద్యులు, ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సవి•క్షా సమావేశాన్ని నిర్వహించారు. రేపు సీఎం పర్యటన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page