జెపి నాడ్డాకు ట్విట్టర్లో సవాల్ చేసిన హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : అబద్ధపు హాలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. 2016లో మర్రిగూడెం పర్యటన సందర్భంగా నాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రజలకు ఇచ్చిన హాలు ఏమయ్యాయని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘ హాలు ఏమయ్యాయి జేపీ నడ్డా గారు..?. 2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, రు పర్యటిస్తూ ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తమన్నరు. రు హ ఇచ్చి ఆరేళ్లయింది.
ఈ సెంటర్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చౌటుప్పల్లో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది. ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్కు నయా పైసా ఇవ్వలేదు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తమని కూడా హ ఇచ్చారు. అబద్ధపు హాలిస్తూ, ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరు. ఈ ఎన్నికల్లో ప్రజలు కు బుద్ధి చెప్పడం ఖాయం.’ అని మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో పోస్టు చేశారు.