మలిదశ ఉద్యమం లాగా మర్లబడుతున్న తెలంగాణ…

అమరుల త్యాగాల పునాదుల పైన సిద్ధించిన ప్రత్యేక రాష్ట్రం, సమైక్య పాలనలో కంటే ఎక్కువ విధ్వంసం జరిగింది అని…. భావించిన విద్యార్థి, మేధావి, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు మరియు సబ్బండవర్గాలు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక తాటిపైకి వచ్చి పోరు చేసిన విధంగా…. ఇప్పుడు కెసిఆర్‌ ను టార్గెట్‌ చేసి ఎట్టి పరిస్థితుల్లో బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకూడదని సభలు, సమావేశాలు, సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రజలను చైతన్య పరుస్తున్నాయి.
ఫలానా పార్టీకి వోట్లు వేయమని చెప్పడం ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు బిఆర్‌ఎస్‌ పార్టీకి వోట్లు వేయవద్దని ప్రచారం చేయడం జరుగుతుంది. నియంతృత్వ పాలన, కుల ప్రీతి, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం,  పారదర్శకతలేని పాలన చేస్తూ… సచివాలయానికి రాకపోవడం, ప్రజాదర్బార్‌ లు పెట్టకపోవడం, ప్రశ్నించిన గొంతులను కేసులు పెట్టి అణచి వేయడం, పేద ప్రజల భూములను దొరల పాలు చేసిన  లిధరణిలి రైతన్నలను కష్టాల పాలు చేయడం జరుగుతుంది. ప్రత్యేక తెలంగాణ సిద్ధిస్తే చాలు అనుకున్నారు, కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులైనాయి కెసిఆర్‌ పాలన పోతే చాలు అనే భావనకు ప్రజలు వచ్చారు, తార  స్థాయికి చేరిన ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పట్ల సానుభూతి కనిపిస్తుంది, 10 మందిని కదిలిస్తే 8, 9 మంది అరాచక పాలన అంతం అవ్వాల్సిందే అని అంటున్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ద్వారా తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఎన్నో కలలు కన్న ప్రజల ఆశలు అడి ఆశలు అయినాయి, అంతరించిపోతుందని అనుకున్నా రాజకీయ అవినీతి పెట్రేగిపోయి ఇసుక, ల్యాండ్‌, లిక్కర్‌, ఎడ్యుకేషన్‌, హెల్త్‌ సెక్టార్లలో మాఫియా రాజ్యమేలుతుంది. ఉద్యమ సంస్థగా టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ కు పట్టం కట్టిన అశేష ప్రజానీకం కాంగ్రెస్‌ వైపు మొగ్గుతున్నారు, అయితే ఈ సమయంలో పైకి కాంగ్రెస్‌ కనిపిస్తు చాప కింద నీరులా లిఎద్దేలు కర్ణాటకలి తరహాలో లిమేలుకో తెలంగాణ… ఏలుకో తెలంగాణ…లి అనే నాదంతో ప్రో: హరి గోపాల్‌ కన్వీనర్‌ గా 270 ప్రజా సంఘాలు కలిసి లిపీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీలి గా ప్రభుత్వంపై అనేక రూపాల్లో దండెత్తుతున్నారు, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా నిద్రపోతున్న ఈ తరుణంలో సామాజిక మాధ్యమాలు కారుచీకటిలో కాంతి రేఖలా  ప్రభావవంతంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ…  ధన్మ డాయి… ముఖ్యంగా తీన్మార్‌ మల్లన్న, తొలివెలుగు రఘు, డాక్టర్‌ మహిపాల్‌ యాదవ్‌, దాసరి శ్రీనివాస్‌,.. లాంటి సోషల్‌ మీడియా వారియర్స్‌ గులాబీ బెదిరింపులకు లొంగకుండా అనేక నష్ట కష్టాలకు గురిచేసిన, అక్రమ కేసులు పెట్టిన లెక్క చేయకుండా నిలబడ్డ విధానం తెలంగాణ పౌరుషాన్ని చాటింది. పాశం యాదగిరి, విమలక్క, డాక్టర్‌ గోపీనాథ్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కోదండరాం, కూరపాటి వెంకటనారాయణ, ఆకునూరు మురళి, శరత్‌ కుమార్‌, పృథ్వీరాజ్‌ విట్టల్‌ రియాజ్‌ సార్‌, అశోక్‌ కుమార్‌, జస్టిస్‌ చంద్రకుమార్‌ ఇంకా ఎందరో మేధావులు ప్రజల పక్షాన నిలబడ్డారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ లో ఐటీ ఉద్యోగులు చేసిన ఆందోళన గురించి చులకనగా మాట్లాడిన కేటీఆర్‌ నష్ట నివారణ కోసం జె పి లాంటి నిష్కళంక, నిజాయితీగల నేతను వాడుకోవడంలోనూ ఆంతర్యం  తెలియని అమాయకులు కాదు ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్రులు. 40 లక్షల మంది నిరుద్యోగ యువత పోరాటాలు చేస్తేనే నోటిఫికేషన్‌ ఇచ్చి, పేపర్‌ లీక్‌ చేసి ఉద్యోగాలు నింపకుండా ఒక తరం విద్యార్థుల జీవితాలు బుగ్గిపాలు చేసినారు. ఈ పాలనలో ప్రభావితం కానీ వర్గం అంటూ లేదు, ఇంత జరుగుతున్న కళ్ళు మూసుకున్న గంట చక్రపాణి లాంటి కొందరు మేధావులు కెసిఆర్‌ మూడవసారి అధికారం చేపట్టాలని కోరుకోవడం దురదృష్టకరం, బాధాకరం…. సమైక్య పాలనలో తన మాట, రాతలతో అగ్గి రాజేసిన ఫైర్‌ బ్రాండ్‌ దేవులపల్లి అమర్‌ ఎందుకు మౌనంగా ఉన్నాడు, లిఆ దేవునికే తెలియాలి,లి అక్షరాలను ఆటంబాంబులుగా చేయగలిగే దిట్ట అల్లం నారాయణకు ప్రజల ఆహాకారాలు వినిపించడం, కనిపించడం లేదా?? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జే ఎమ్‌ ఎమ్‌ లాంటి ఉద్యమ పార్టీ ఒకటి, రెండు సార్లు అధికారానికి దూరమైన… ఇప్పుడు ఇంకా అక్కడ పాలన కొనసాగిస్తున్నది, అట్లాంటి పరిస్థితి బిఆర్‌ఎస్‌ గా మారిన టిఆర్‌ఎస్‌ కు ఉంటుందా? అన్నది సందేహమే. రీ డిజైన్‌ చేసి కట్టిన కాళేశ్వరం  ఎత్తిపోతల పథకం ఇంకా వైట్‌ ఎలిఫెంట్‌ గా మిగిలిపోవడం….  కాంగ్రెస్‌ శుక్రవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని నీగ్గు తేల్చడానికి సిట్టింగ్‌ జడ్జిని నియమిస్తామని పేర్కొనడం ఆహ్వానించదగిన పరిణామం. లోపా భూయిష్టమైన పథకాలు, తలపొగరు మాటలు, ఫామ్‌ హౌస్‌ రాజకీయాలతో విసిగిపోయిన జనంలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రారంభమై ఎన్నికల తేదీ నాటికి అది ఇంకా ఎక్కువ అవుతుందని ప్రస్తుత పార్టీల ప్రచార సరళి చూస్తే అవగతం అవుతుంది… అదే సమయంలో కాంగ్రెస్‌ పట్ల సానుభూతి పవనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సునామీలా కాంగ్రెస్‌ ప్రకంపనలు సృష్టిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ వస్తే చాలు అనుకున్న ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఇప్పుడు కెసిఆర్‌ పాలన పోతే చాలు అనే భావనతో ఉన్నట్లుగా పరిణామాలు, పరిస్థితులు కనిపిస్తున్నాయి… ఏది ఏమైనా ఈ ఎన్నికలు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.
-పబ్బు శ్రీనివాస్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌
944 1331288

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page