మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 11: శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ లో  మూడు కోట్ల తొంబై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా నిర్మిస్తున్న మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను  ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ  గాంధీ  మాట్లాడుతూ పాపి రెడ్డి కాలనీలో రెండు ఎకరాల స్థలంలో మూడు కోట్ల 95 లక్షల రూపాయలతో అందరికి  అందుబాటులో ఉండే విదంగా ,అన్ని హంగుల తో,సకల సౌకర్యాలతో  నిర్మించడం జరిగినది అని సర్వ హంగులతో సిద్ధంగా ఉంది అని అతి త్వరలోనే మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు.  ప్రజల అవసరాల దృష్ట్యా మిగిలిపోయిన అసంపూర్తి పనులు త్వరితగతిన పూర్తి చేసి  త్వరలోనే అందుబాటులోకి తీసుకురావలని , నాణ్యత ప్రమాణాల తో నిర్మించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని అధికారులకు తెలియచేసారు ,మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను అన్ని హంగులతో ,అదునుతంగా ప్రయివేట్ ఫంక్షన్ హాల్లకు దీటుగా నిర్మిస్తున్నామని,పేద ,మధ్యతరగతి ప్రజలు పెళ్లి లు చేసుకోవడానికి ఇందులో పైన స్టేజి పక్కన రెండు గదులు ,దీపాలు ,విశాలమైన హాల్, అధునూతన టైల్స్ పార్కింగ్ వంటి సకల వసతులతో నిర్మిస్తున్నామన్నారు.  ఫంక్షన్ హాల్ కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని  కాలనీ అభివృద్ధి మరియు సమస్యల పై చర్చించుకోవడానికి చిన్న చిన్న సమావేశాలు, బర్త్ డే పార్టీలు ,వివాహాలు , పొదుపు సమాఖ్య  మహిళా ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని, సభలు,సమావేశాలు  నిర్వహించుకునేందుకు వీలుగా భవనం ఉపయోగపడుతుంది అని అన్నారు. మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణము పై అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు . అందరు కలిసి కాలనీ అభివృద్ధికి పాటు పడాలని,కాలనీ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని,ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని అదేవిధంగా కాలనీ లలో తన దృష్టికి వచ్చిన .ఏ చిన్నసమస్యనైనా  పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గాంధీ   పేర్కొన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ   పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  జిహెచ్ఎంసి ఈ ఈ శ్రీనివాస్ ఏ ఈ సునీల్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ , మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు  బసవయ్య, రాథోడ్, సౌజన్య స్థానికులు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page