మహాత్ముని మార్గం అహింసాయుతమైనది వారి మార్గమే మనకు శ్రీరామరక్ష కమల సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర అక్టోబర్ 2: మన జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి* సందర్భంగా ఈరోజు   ఎల్బీనగర్ శాసనసభ్యులు *డా. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సతీమణి మరియు శ్రీ జయ చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి *దేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డి* చంపాపేట్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెల్ల దొరల మెడలు వంచి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని. విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం ద్వారా దేశ ప్రజల్లో సమైక్యత భావం ఏర్పడి దేశ ప్రజలంతా  ఒక్క తాటిపైకి అందరి నినాదం భారతదేశ స్వతంత్రం అనే విధంగా తీసుకువచ్చిందని అన్నారు.నేడు మన జాతిపిత మహాత్మా గాంధీ  మార్గాన్ని ప్రపంచం మొత్తం అనుసరిస్తుందని కొనియాడారు. ఇదే అహింసాహిత మార్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చారని, స్వపరిపాలనలో సుపరిపానందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్మాన్ ఘాట్ టెంపుల్ చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, చెంపాపెట్ డివిజన్ ప్రెసిడెంట్ ముడుపు రాజ్ కుమార్ రెడ్డి, హనుమాన్ టెంపుల్ డైరెక్టర్లు గోగిరెడ్డి అంజిరెడ్డి, సురేష్ గౌడ్, మేక సురేందర్, చీర తిరుమలేష్ ,మాజీ డైరెక్టర్ అంతోజి కృష్ణమాచారి , బీసీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి వెంకటేష్,ఎల్బీనగర్ యూత్ ప్రెసిడెంట్ రవి ముదిరాజ్ ,మహిళ విభాగం అధ్యక్షురాలు రోజా రెడ్డి, ఉషా, వసంత ,  లక్ష్మి, నాగమణి, మాధవి,కవిత, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
చైతన్యపురి డివిజన్ లో : నేడు జాతిపిత మహాత్మగాంధీ 154వ జయంతి సందర్బంగా చైతన్యపురి డివిజన్ లోని వికాస్ నగర్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా కమల సుధీర్ రెడ్డిగారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్,బిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, శరత్ చంద్ర, మహిళా నాయకులు శోభరాణి, జ్యోతి, జయశ్రీ,పావని,సంగీత,అనిత,నాయకులు నరేందర్ రెడ్డి, సంతోష్ యాదవ్, కృష్ణ,గట్టు శ్రీను, రమణారెడ్డి,ప్రవీణ్, కిషన్,శ్రీనివాస్ యాదవ్,సంతోష్,శ్రీను,నాగరాజు,పులి కిరణ్,కళ్యాణ్, రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page