మహారాష్ట్ర, జార్ఖండ్‌లో మోగిన ఎన్నికల నగారా

మహారాష్ట్రలో నవంబర్‌ 20న ఒకే విడతలో పోలింగ్‌
జార్ఖండ్‌లో నవంబర్‌ 13, 20న రెండు విడతల్లో ఎన్నికలు
రెండు రాష్టాల్ల్రోనూ నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు
ఉత్తరప్రదేశ్‌లో 9 అసెంబ్లీ స్థానాలకు 13న ఉప ఎన్నిక
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడి

ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్‌డెస్క్‌ అక్టోబర్‌15:  మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్‌ 20న ఒకే విడతలో పోలింగ్‌ జరుపనున్నట్టు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. నవంబర్‌ 23న ఫలితాలు ప్రకటిస్తారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 22న వెలువడుతుంది. నామినేషన్ల గడవు అక్టోబర్‌ 29వ తేదీతో ముగుస్తుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్‌ 30న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్‌ 4వ తేదీతో ముగుస్తుంది. నవంబర్‌ 25వ తేదీలోగా ఎన్నికలు ముగియాల్సి ఉంటుంది. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరుగనున్నట్టు సీఈసీ ప్రకటించారు. తొలి విడత నవంబర్‌ 13, రెండో విడత నవంబర్‌ 20న జరుగుతుంది.

తొలి విడత ఎన్నికలకు అక్టోబర్‌ 18న నోటిఫికేషన్‌ వెలువడుతుంది. అక్టోబర్‌ 25తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. అక్టోబర్‌ 28న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అక్టోబర్‌ 30తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. తొలి విడతలో భాగంగా 43 నియోజకవర్గాలకు నవంబర్‌ 13న పోలింగ్‌ జరుగుతుంది. రెండో విడత నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 22న వెలువడుతుంది. అక్టోబర్‌ 29తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. అక్టోబర్‌ 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్‌ 1వ తేదీతో ముగుస్తుంది. నవంబర్‌ 20న రెండో విడత పోలింగ్‌ జరుగుతుంది. నవంబర్‌ 23న కౌంటింగ్‌ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్‌ 26తో ముగుస్తోంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

81 స్థానాలున్న జార్ఖాండ్‌ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో ముగుస్తుంది. మహారాష్ట్రలో బిజీపీ, శివసేన, ఎన్‌సీపీతో కూడిన మహాకూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా, జార్ఖాండ్‌లో జెఎంఎం అధికారంలో ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని కూడా ఎన్నికల కమిషన్‌ మంగళవారంనాడు ప్రకటించింది. నవంబర్‌ 13న పోలింగ్‌ జరుగనుండగా, నవంబర్‌ 23న ఫలితాలు ప్రకటిస్తారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటిస్తారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరుగనున్న 9 అసెంబ్లీ స్థానాల్లో విూరాపూర్‌, కుందర్కి, ఘజియాబాద్‌, ఖైర్‌, కర్హాల్‌, సిషామౌ, ఫూల్పూర్‌, కతెహారి, మజవాన్‌ ఉన్నాయి. వీటిలో నాలుగు స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ 3, రాష్టీయ్ర లోక్‌దళ, నిషద్‌ పార్టీ చెరో స్థానం గెలుచుకున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఆయా పార్టీల నేతలు తాము గెలిచిన అసెంబ్లీ స్థానాలను వదులుకోవడంతో యూపీలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి యూపీలో ఎదురుదెబ్బ తగలడంతో ఈ అసెంబ్లీ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గట్టి సవాలనే చెప్పాలి.

రెండు రాష్టాల్రకు పరిశీలకులగా భట్టి, ఉత్తమ్‌, సీతక్క
న్యూదిల్లీ,  ప్రజాతంత్ర‌, అక్టోబర్‌15: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రెండు రాష్టాల్ర ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు తారిక్‌ అన్వర్‌, అధిర్‌ రంజన్‌ చౌదరిని నియమించారు. ఇక మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించగా.. అందులో తెలంగాణ రాష్టాన్రికి చెందిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీతక్కకు బాధ్యతలు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page