మహిళా శక్తి పథకం ద్వారా … కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

అడిషనల్‌ ‌కమిషనర్‌ ‌చంద్రకాంత్‌ ‌రెడ్డి
మహిళలకు సమగ్రంగా అవగాహన కల్పించాలి
జిహెచ్‌ఎం‌సి లో అమలుకు ప్రత్యేక దృష్టి సారించాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 24: మహిళా శక్తి పథకం ద్వారా వొచ్చే ఐదు సంవత్సరాలలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అడిషనల్‌ ‌కమిషనర్‌ ‌చంద్రకాంత్‌ ‌రెడ్డి అన్నారు. బుధవారం జిహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాల యంలోని పన్వర్‌ ‌హాల్లో యూసీడి ప్రాజెక్ట్ ఆఫీసర్లు, టిఎల్‌ఎఫ్‌ ‌లీడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యుసిడి జాయింట్‌ ‌కమిషనర్‌, ‌పరిశ్రమల శాఖ జెడి, ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌సొసైటీ అధికారులు, హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మేడ్చల్‌ ‌జిల్లాల ఎల్‌ ‌డీఎంలు, మెప్మా స్టేట్‌ ‌మిషన్‌ ‌నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుసిడి అడిషనల్‌ ‌కమిషనర్‌ ‌చంద్రకాంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ… జి హెచ్‌ ఎం ‌సి కమిషనర్‌ ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్స్, ‌క్యాటరింగ్‌ ‌యూనిట్స్, ‌తెలం గాణా పిండి వంటలు, బొటిక్స్, ‌పిండి గిర్ని, డిటిపి జిరాక్స్ ‌సెంటర్‌, ‌టైలరింగ్‌, ఎం‌బ్రా యిడరీ యూనిట్స్ ‌తదితరాలు ఏర్పాటు చేసుకునేలా ఎస్‌హెచ్‌జి మహిళలకు అవగా హన కల్పించి పథకం అమలు చేయడంలో ఆయా అధికారులు సమన్వయంతో పనిచేయా లన్నారు. టిఎల్‌ఎఫ్‌, ఎస్‌ఎల్‌ఎఫ్‌ ‌సమావే శాలను రెండు రోజులలోగా పూర్తి చేసి ఎస్‌ ‌హెచ్‌జి మహిళలకు సమగ్రంగా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. జిహె చ్‌ఎం‌సి పరిధిలో నడిచే గ్రూప్‌ ఎం‌టర్ప్రైజెస్‌ను గుర్తించి ఆయా యూనిట్ల ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. మెప్మా స్టేట్‌ ‌మిషన్‌ ‌కోఆర్డి నేటర్లు ప్రసన్న కుమార్‌, ‌పద్మ లు మహిళా శక్తి పథకం గురించి, పథకం అమలుకు చేప ట్టాల్సిన చర్యలు, జిహెచ్‌ఎం‌సి కి కేటాయించిన లక్ష్యం, ఆయా యూనిట్లకు అందిస్తున్న రుణా లు, సబ్సిడీ, తదితరాలపై వివరించారు.

మేజర్‌ ‌గ్రూప్‌ ఎం‌టర్ప్రైజెస్‌ ‌గా క్యాంటీన్స్, ‌ఫుడ్‌ ‌ట్రాక్స్, ‌కోల్డ్ ‌స్టోరేజ్‌, ‌క్యాటరింగ్‌ ‌సర్వీసెస్‌, ‌మీసేవ సెంటర్స్, ‌కన్స్ట్రక్షన్‌ ఎక్విప్మెంట్‌ ‌తదితరా లను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. మేజర్‌ ఇం‌డివిడ్యుల్‌ ఎం‌టర్ప్రైజెస్‌ ‌కింద తెలంగాణ పిండి వంటలు, పచ్చళ్ళు- పొడులు, పాల ఉత్పత్తులు, హ్యాండ్‌ ‌మేడ్‌ ‌క్రాప్టస్, ‌గిఫ్ట్ ఆర్టికల్‌ ‌షాప్స్, ‌కిరాణా దుకాణాలు, నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. టిఎల్‌ఎఫ్‌లు, ఎస్‌ ఎల్‌ఎఫ్‌లు ఎస్‌హెచ్‌జి మహి ళలకు సమ గ్రంగా అవగాహన కల్పించి, యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చైతన్య పరచాలన్నారు. గృహ సేవకి (గిన్నెలను శుభ్రపరచడం, బట్టలు తుకడం, ఇల్లు తుడవ డానికి, వంట చేయడం, పెద్ద వాళ్ల, చిన్న పిల్లల బాగోగులు చూసు కోవడం లాంటి పనులకు) కోసం నెలవారీగా, పార్ట్ ‌టైం, ఫుల్‌ ‌టైం కొరకు ఎస్‌హెచ్‌జి మహిళలను గుర్తించాలని టౌన్‌ ‌లెవెల్‌ ‌ఫె డరేషన్‌ ‌లీడర్లకు సూచించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం (పిఎంఎఫ్‌ఎం ఈ) ‌కింద వ్యక్తిగత మైక్రో ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్స్ ‌నెలకొల్పుటకు అంది స్తున్న రుణం, రాయితీ, ఆహార తయారీ రంగంలో ఉన్న ఎస్‌ ‌హెచ్‌జి సభ్యులకు అందిస్తున్న మూలధనం, ఉప కరణాల కొనుగోలుకు అందించే రుణం, నిబంధనల గురించి రాష్ట్ర ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌సొసైటీ ప్రతినిధి శ్రీరామ్‌ ‌వివరించారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో ఏఏ ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్స్ ఏర్పాటు చేయవచ్చో గుర్తించాలని, ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్ల ఏర్పాటుకు సంబం ధించిన ముందస్తు ప్రక్రియను వివరించారు. గ్రామో దయ వికాస్‌ ‌యోజన(జీవీవై) పథకం, ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం (పీఎంఈజీపీ), పీఎం విశ్వకర్మ స్కీం, సేవా రంగం, ఉత్పత్తి రంగం తదితరాల గురించి కె విఐసి జిల్లా నోడల్‌ అధికారి రాజేష్‌ ‌కుమార్‌ ‌వివరించారు.

స్థానిక ఏరియాలలో ఉన్న డిమాండ్‌ ‌మేరకు ఆయా యూనిట్ల ఏర్పాటుకు ప్లాన్‌ ‌చేసుకోవాలని సూచించారు. వీధి వ్యాపారులకు చేయూత పథకం గురించి మెప్మా స్టేట్‌ ‌మిషన్‌ ‌కోఆర్డినేట్‌ అధికారి చైతన్య వివరించారు. పండ్లు, కూరగాయలు, పూల మార్కెట్లను గుర్తించి అక్కడ కోల్డ్ ‌స్టోరేజ్‌ ‌రూములను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యుసిడి ప్రాజెక్ట్ ‌జాయింట్‌ ‌కమిషనర్‌ ‌వెంకటరెడ్డి, పిడి సౌజన్య రంగా రెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌ ‌మల్కజిగిరి. జిల్లాల లీడ్‌ ‌బ్యాంక్‌ అధికారులు టౌన్‌, ‌స్లామ్‌ ‌లెవెల్‌ ‌స్థాయి మహిళ ప్రతినిధులు తదితరులు పాల్గొ న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page