భారత్ జోడో పాదయాత్ర లో భాగంగా మంగళ వారం లెగసీ ప్యాలెస్ లో మహిళా సాధికారత పై వివిధ సంఘాలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. సమావేశంలో ట్రాన్స్ జెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, ఒంటరి మహిళలు, బస్తి మహిళల సమస్యలు ,ముస్లిమ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ సంఘాల మహిళ నేతలు రాహుల్ గాంధీకి వివరించారు. వారి వాదన నిన్ను రాహుల్ గాంధీ దీనిపై సమగ్రంగా చర్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు తను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.