మహేశ్వరం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 03; మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండల కేంద్రం లో 81 లక్షల రూపాయలతో మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి అయినా ప్రాథమిక పాఠశాల భవనము సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి . అనంతరం మంత్రివర్యులు భారతరత్న అవార్డు గ్రహీత బిఅర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగినది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక వైపు అభివృద్ధిలో ముందుకెళ్తూనే సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పాఠశాల తరగతి గదిలో విద్యార్థిని విద్యార్థులతో కాసేపు మాటామంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి , మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి వైస్ ఎంపీపీ సునీత అంధ్య నాయక్,ఎంపీటీసీ సభ్యులు బిఆర్ఎస్ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముధిరాజ్,ఎస్ ఆనందం,కూన యాదయ్య,పోతార్ల అంబయ్య యాదవ్, ఎం నవీన్, ఎం ఎ సమీర్, దోమ శ్రీనివాస్ రెడ్డి,ఎం సంజీవ , పెయ్యాల కుమార్,కడమోని ప్రభాకర్,రాజు నాయక్,కోఆప్షన్ సభ్యులు ఆదిల్ అలీ,అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page