ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 2 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామంలో వెలసిన శ్రీ మైసమ్మ దేవత అమ్మవారి కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్ 27 నుంచి అమ్మవారికి కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు. శనివారం అమ్మవారిని వివిధ కూరగాయలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్ట్ ఆర్. లక్ష్మి శిరోలీ పంతూ నాయక్, గ్రేడ్ 1 కార్యనిర్వాహణ అధికారి స్నేహలత, ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.