మునుగోడుపై నా ప్రమేయం లేకుండానే నిర్ణయాలు

  • స్టార్‌ ‌కాంపెయినర్‌ ‌బాధ్యతలు ఇస్తే నిలబడతా
  • పార్టీ వ్యవహారాలపై సోనియాతో మాట్లాడుతా
  • కాంగ్రెస్‌ ఎం‌పి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి
  • సోనియా అపాయింట్‌మెంట్‌ ‌కోరిన కోమటిరెడ్డి, శశిధర్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 18 : మునుగోడు ఉపఎన్నికలో పార్టీ స్టార్‌ ‌క్యాంపెయినర్‌గా బాధ్యతలు అప్పగిస్తే ప్రచారం చేస్తానని కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. అయితే తన ప్రమేయం లేకుండానే కాంగ్రెస్‌ ‌నేతలు కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌దక్షిణ తెలంగాణ వివక్ష చూయిస్తున్నారని ఆరోపించారు. చౌటుప్పల్‌, ‌గుడిమల్కాపురం రోడ్డును ఆరు నెలల క్రితం అడిగితే పట్టించుకోలేదని..ఇప్పుడు ఉపఎన్నిక వస్తుందని హడావిడిగా రోడ్డు వేస్తున్నారని అన్నారు. ఈ రోడ్డు కాంట్రాక్టర్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌కు బంధువని చెప్పారు. సీఎం ఫాంహౌస్‌ ‌చుట్టూ 600 కోట్లతో 3 నెలల్లో రోడ్లు వేస్తే..ఈ చిన్న రోడ్డును వేయడానికి ఏడాది పట్టిందని కోమటిరెడ్డి అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో రోడ్లు బాగుంటాయి కానీ మిగితా నియోజకవర్గాల్లో ఎందుకుండయని ప్రశ్నించారు. 350 కోట్లతో పిలాయిపల్లి కాలువ ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్‌ ‌చెప్పగా..అందులో 50 కోట్లు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దోచకున్నారని ఆరోపించారు. గజ్వేల్‌, ‌సిరిసిల్ల, సిద్దిపేటలో, 20వేల డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇల్లు కట్టిస్తే మునుగోడులో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.

కాగా దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయుడు సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ అని కోమటిరెడ్డి అన్నారు. సర్దార్‌ అనే బిరుదు మొదటగా వచ్చింది ఆయనకేనని చెప్పారు. ఇదిలావుంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోనియా గాంధీ అపాయింట్‌మెంట్‌ ‌కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన సోనియాకు వివరించనున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి.. రాష్ట్ర నాయకత్వానికి మధ్య ఇటీవల జరుగుతోన్న కోల్డ్ ‌వార్‌ ‌నేపథ్యంలో.. అధినేత్రి అపాయింట్‌మెంట్‌ ‌కోరటం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు జరుగుతున్న అవమానాల గురించి దిల్లీలోనే తేల్చుకుంటానని వెంకట్‌రెడ్డి బహిరంగంగానే చెప్పిన సంగతి తెలిసిందే.పార్టీలో తాజా పరిణామాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు సోనియాగాంధీతో పాటు రాహుల్‌, ‌ప్రియాంక గాంధీలను కలువనున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ల వైఖరిని తప్పుబడుతున్న వెంకటరెడ్డి రాష్ట్రంలో తాజా పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదిక ఇస్తానని తెలిపారు. పార్టీలో చేరికలు, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకత్వంపై వ్యక్తమవుతున్న అసంతృప్తి గురించి వివరించనున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ ‌సీనియర్‌? ‌నేత మర్రి శశిధర్‌రెడ్డి సైతం సోనియాతో భేటీ అయ్యే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అధిష్ఠానానికి తెలియనీయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్న మర్రి.. తమ ఆవేదనను సోనియాకు వివరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సోనియాగాంధీని, రాహుల్‌ ‌గాంధీలను కలిసి వివరించేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది.రేవంత్‌రెడ్డి, మాణిక్కం ఠాగూర్‌ల గురించి మర్రి శశిధర్‌ ‌రెడ్డి.. బుధవారం రోజున కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆ ఇద్దరు నేతలు అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ.. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగేలా దిశానిర్దేశం చేయాల్సిన మాణిక్కం ఠాగూర్‌.. ‌రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదని మర్రి మండి పడ్డారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా కలత చెందుతున్నానని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని శశిధర్‌రెడ్డి ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలోనే మర్రి సోనియాతో భేటీ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page