మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా

పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఇసి ప్రకటన
3న ఉప ఎన్నికనిర్వహణ.. 6న వోట్ల లెక్కింపు
7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ‌విడుదల
14 వరకు నామినేషన్లు..15న పరిశీలన
17ననామినేషన్ల ఉపసంమరణ..అమల్లోకి నిబంధనలు

న్యూదిల్లీ, అక్టోబర్‌ 3 : ‌రాష్ట్రంలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్రెన్నికల సంఘం విడుదల చేసింది. మునుగోడులో నవంబర్‌ 3‌న ఉప ఎన్నిక పోలింగ్‌ ‌నిర్వహించనున్నారు. నవంబర్‌ 6‌న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉప ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్‌ ‌విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ నెల 14 వరకు నామినేషన్ల సమర్పణకు గడువు తేదీని ప్రకటించింది. 15న నామినేషన్ల పరిశీలన.. ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. మునుగోడు సహా 6 రాష్టాల్ల్రోని 7 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. తక్షణమే మునుగోడులో ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది. తెలంగాణ (మునుగోడు) తో పాటు మరో ఐదు రాష్టాల్ల్రో అంటే మహారాష్ట్ర, బీహార్‌, ‌హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, ఒడిస్సాలోనూ ఖాళీగా ఉన్న స్థానాల్లో ఎన్నికల నిర్వహ ణకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఇకపోతే మునుగోడుకు సంబంధంచి ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు కొంతకాలంగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్‌ ‌రావడంతో పార్టీల్లో మరింత వేడి రాజుకోనుంది.

ఈ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో ఇక ప్రాచరం మరింత వేడెక్కనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ బీజేపీ, టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు తలపడుతున్నాయి. మూడు పార్టీలకు ఈ విజయం తప్పనిసరి కావడంతో బాగా ఫోకస్‌ ‌పెట్టాయి. బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బీజేపీ యాక్షన్‌ ‌ప్లాన్‌ ‌ను సిద్ధం చేసింది. దసరా తరువాతి రోజు నుంచి మునుగోడుపై దండయాత్రకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. 7వ తేదీ నుంచి మునుగోడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఫోకస్‌ ‌చేయనున్నారు. ప్రతి నేత.. ప్రతి ఇంటిని టచ్‌ ‌చేసేలా ప్రచారానికి సంబంధించిన ప్లాన్‌ ‌సిద్ధం చేస్తున్నారు. ఈనెల 7న మునుగోడులో అన్ని గ్రామాల్లో బీజేపీ బైక్‌ ‌యాత్రలు నిర్వహించనుంది. 10వ తేదీన బూత్‌ ‌కమిటీ సభ్యలతో బండి సంజయ్‌ ఆధ్వర్యంలో టింగ్‌ ‌జరగనుంది. 189 గ్రామాల్లో జరగనున్న బైక్‌ ‌యాత్రల్లో స్టీరింగ్‌ ‌కమిటీ సభ్యులు, మండల ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ ‌పార్టీ సైతం మునుగోడుపై ఫోకస్‌ ‌పెట్టింది. ఇప్పటికే అధికారుల బదిలీలు.. వామపక్షాలను తమవైపు తిప్పుకోవడంలో ముందుంది. మరోవైపు కాంగ్రెస్‌ ‌పార్టీ సైతం మునుగోడులో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌ ‌పార్టీ తరుఫున పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. ఆమె నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. రోజుకో సీనియర్‌ ‌నేత మునుగోడుకు వెళ్లి ఆమె తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఈ ముక్కోణపు పోటీలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

బండి ఐదో విడతయాత్ర వాయిదా
మునుగోడు నోటిఫికేషన్‌తో యాత్రకు బ్రేక్‌
ఇక ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కార్యాచరణ
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌3 : ‌బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టబోయే అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా పడింది.ఈ నెల 15 నుంచి అయిదో విడద పాదయాత్ర నిర్వహించాలను కున్నారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ ‌రావడంతో బండి సంజయ్‌ ‌తన నిర్ణయాన్ని మార్చుకుని పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ ‌రావడంతో పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. బండి సంజయ్‌ ఈ ‌నెల 15 నుంచి అయిదో విడత పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ ‌రావడంతో బండి సంజయ్‌ ‌తన నిర్ణయాన్ని మార్చుకుని పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా బండి సంజయ్‌ ‌ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ ‌వెలువడిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఉన్న నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎంసీసీ అమల్లోకి వచ్చింది. మునుగోడు సహా 6 రాష్టాల్లోన్రి 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌?‌ను ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలో ఉప ఎన్నికపై బండి దృష్టి పెట్టి ముందుకు సాగనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page