కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్ ఫిర్యాదు
మునుగోడు ఎప ఎన్నికలో పోటీలో ఉన్న బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి చెందిన సంస్థ నుండి పలువురు వ్యక్తులు, స్థానిక వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసారని కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. రాజగోపాల్ రెడ్డి సంస్థ నుండి రూ. 5.22 కోట్లు స్థానిక వ్యక్తులు, వ్యాపారుల ఖాతాలకు మళ్ళించారని, మొత్తం డబ్బు ప్రస్తుతం జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో పంపిణీ చేయడం కోసమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయకముందే ఆ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని ఇసిని కోరింది. ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని టిఆర్‌ఎస్ పేర్కొంది.తక్షణమే రాజగోపాల్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.