జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 17: గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు ,అదృష్టవంతులు అని అందుకే కెసిఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేసే అదృష్టం మీవంతు వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు శుక్రవారం నాడు మండల కేంద్రమైన జగదేవపూర్ లో బహిరంగ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ … తెల్లవారి లేవగానే నీటి బిందలో కెసిఆర్ కనిపిస్తున్నాడని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ ప్రజల కష్టాలు తీరలేదన్నారు. కాంగ్రెస్ ని గెలిపించిన పాపానికి రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లని దయవల్ల ఇక్కడ రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతుందన్నారు. కరోనా వచ్చిన సమయంలో ఏ ఒక్క నాయకుడైన వచ్చి ప్రజలను పలకరించిన పాపాన పోలేదని ఎన్నికల రాగానే తరలి వస్తు హామీలు ఇవ్వడం సిగ్గుచేటగా ఉందన్నారు. ఎన్నికల అనంతరం ప్రతి రైతు కుటుంబంలో రైతు బంధు అందివ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అందివ్వడం లేదని తెలిపారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా ఈ సంక్షేమ పథకాలు నందివడం లేదని తెలంగాణ రాష్ట్రంలో నెరవేర్చలేని హామీలను ఎలా అందిస్తారని ప్రశ్నించారు ప్రజలు ఇప్పటికైనా గమనిస్తూ కేసీఆర్‌కే మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మండల పార్టీ నాయకులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ బాలేశం గౌడ్, గుండా రంగారెడ్డి,జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సయ్యద్ ఇక్బాల్, మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు రాచల్ల నరేష్, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు రైతు సమన్వయ సందు సభ్యులు,కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.