- పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన రాకపోకలు
- నీట మునిగిన బస్తీలు
- చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిలపై రాకపోకలు బంద్
- పలు ప్రాంతాల్లో పర్యటించిన పోలీస్, జిహెచ్ఎంసి అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : ఎగువన కురిసిన వర్షాలతో వరద పోటెత్తడంతో హైదరాబాద్‌లో మూసీ పొంగి ప్రవహిస్తుంది. మూసీ వరదతో అనేక బస్తీలు నీట మునిగాయి. చాదర్‌ఘాట్, పురానాఫూల్, మూసారాంబాగ్‌లలో వంతెనలపై నుంచి వరద పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఈ రూట్లో రాకపోకలను నిలిపివేశారు. అంతకతకూ పెరుగుతున్న వరద మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో మూసీ నదిలోకి వరద పోటెత్తింది. నేడు వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
నదిలో భారీగా వరద వొస్తుండటంతో హైదరాబాద్‌లోని జియాగూడవద్ద మూసీ పొంగిపొర్లుతున్నది. చాదర్‌ఘాట్ లోలెవల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. అదేవిధంగా మూసారాంబాగ్ చాందిని బ్రిడ్జిపై నుంచి వరద వెళ్తున్నది. దీంతో అధికారులు చాదర్‌ఘాట్ లోలెవల్ బ్రిడ్జితోపాటు మూసారాంబాగ్ వంతెనపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. చాదర్‌ఘాట్‌లోని మూసానగర్, శంకర్ కాలనీ బస్తీలను వరద ముంచెత్తింది. దీంతో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఎగువన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్, హియాయత్‌సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక్కో రిజర్వాయర్‌కు 8 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు గాను ప్రస్తుతం 1761.9 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ప్లో 8000 క్యూ సెక్కులు కాగా.. ఔట్ ప్లో 10700 క్యూ సెక్కులు ఉంది.
దీంతో 8 గేట్లు 4 అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1789.10 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ప్లో 8000 క్యూసెక్కులు ఉండగా.. ఔట•ప్లో 8281 క్యూసెక్కులుగా ఉంది. 13 గేట్లు ఆరు అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని వదులుతున్నారు. మూసీ నది ఉధృతితో అధికారులు అలర్ఠ్ అయ్యారు. అంబర్‌పేట-కాచిగూడ, మూసారాంబాగ్- మలక్‌పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోవైపు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉస్మాన్ సాగర్, ఓఆర్ఆర్ వద్ద వరద ప్రవాహాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు.
వర్షం ముంపునకు గురైన ప్రాంతాల్లో పరిస్థితిని సవి•క్షించేందుకు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడుతో కలిసి హిమాయత్ సాగర్ చెరువు, హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు, గండిపేట చెరువులను సందర్శించారు. భారీ వర్షాల కారణంగా హిమాయత్, ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరద నీరు పెరుగు తోందని, పరిస్థితిని సవి•క్షించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు. సైబరాబాద్ పోలీసులు ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలదిపారు.
నల్లగొండ జిల్లాలో మూసీ ప్రాజెక్టుకు అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ముందస్తుగా మూసీనది ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి నాలుగు అడుగుల ఎత్తిత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం రుద్రవల్లి గ్రామ శివారులో లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బీబీనగర్ మండలం, రుద్రవల్లి, భూదాన్ పోచలంపల్లి మండలం జూలురు గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవ్ బ్రిడ్జికి ఇరువైపుల వాహనదారులు, ప్రజలు ప్రయాణించకుండా బీబీనగర్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వలిగొండ మండలం సంగెం సవి•పంలోని భీమలింగం వద్ద లోలెవల్ వంతెనపై మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో భువనగిరి మండలం, భుల్లేపల్లి, వలిగొండ మండలం, సంగెం గ్రామాల మధ్య
రాకపోకలు స్తంభించాయి.
ఎనిమిది గేట్లు ఎత్తిన అధికారులు
ఎగువన భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడంతో అధికారులు ముందస్తుగా ఎనిమిది గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5733.36 క్యూసెక్కుల వరద వస్తుండగా, 17,809.25 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. మూసీ పూర్తిస్థాయిస్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 637.50 అడుగులుగా ఉంది.
ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 4.46 టీఎంసీలు. ఇప్పుడు 2.67 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. నేడు వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నదిలో భారీగా వరద వొస్తుండటంతో హైదరాబాద్‌లోని జియాగూడవద్ద మూసీ పొంగి పొర్లుతున్నది. చాదర్‌ఘాట్‌లోని మూసానగర్, శంకర్ కాలనీ బస్తీలను వరద ముంచెత్తింది. దీంతో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.