మేక్‌ ఇం‌డియా నంబర్‌ ‌వన్‌

  • మారుమూల ప్రాంతాలకు సైతం విద్య, వైద్యం
  • విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంపై ప్రధాన దృష్టి
  • 75ఏళ్లలో ఎంతో సాధించినా.. ప్రజల్లో ఆగ్రహం తగ్గలేదు
  • యువశక్తిని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంది
  • అన్నిపార్టీలు తనతో కలసి రావాలన్న కేజ్రీవాల్‌
  • ‌దిల్లీలో కార్యక్రమం ప్రారంభోత్సవంలో సిఎం కేజ్రీవాల పిలుపు

న్యూ దిల్లీ, అగస్టు 17: భారత దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ప్రథమ స్థానంలో నిలిపేందుకు తనతో కలిసి రావాలని అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌కోరారు. తనతో కలసి అడుగు వేయాలన్నారు. యావత్తు దేశ సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ లక్ష్యం కోసం మేక్‌ ఇం‌డియా నెం.1 అనే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజీవ్రాల్‌ ‌మాట్లాడుతూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పాఠశాలలను నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్‌, ‌బీజేపీ, ఇతర పార్టీలకు పిలుపునిచ్చారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంపై ప్రధాన దృష్టితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశాన్ని నెంబర్‌ ‌వన్‌ ‌స్థానంలో నిలిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు తనతో కలిసి రావాలన్నారు. మేక్‌ ఇం‌డియా నెంబర్‌ ‌వన్‌ ‌మిషన్‌ ‌ద్వారా దేశంలోని 130 కోట్ల మంది భారతీయులను అనుసంధానం చేస్తామన్నారు.

భారత దేశానికి స్వాతంత్య్ర సిద్ధించి 75 సంవత్సరాలు అయిందని, ఈ సమయంలో ఎంతో సాధించామని, అయినా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. ఈ కాలంలో చాలా చిన్న దేశాలు మన కన్నా ముందుకు దూసుకెళ్ళాయనే భావన ఉందని చెప్పారు. 7 కోట్ల మంది బాలలకు మంచి, ఉచిత విద్యను అందజేయాలన్నారు. పర్వతాలు, గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేయలేమని మనం చెప్పకూడదన్నారు. ఎంత ఖర్చు అయినప్పటికీ, ఈ పనిని చేయాలన్నారు. ఓ బాలుడు లేదా బాలిక తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసి, ధనిక కుటుంబంగా మార్చగలరన్నారు. అలాంటపుడు సంపన్న దేశాల జాబితాలో భారత దేశం చేరుతుందని చెప్పారు. మనం దృష్టి సారించవలసిన రెండో అంశం, ప్రజలకు మెరుగైన, ఉచిత వైద్య చికిత్సను అందజేయడమని చెప్పారు. మనం కృషి చేయవలసిన మూడో అంశం యువశక్తి అని తెలిపారు. యువశక్తి మనకుగల అద్భుతమైన బలమని చెప్పారు. నేడు యువత నిరుద్యోగులుగా ఉండిపోతున్నారని, యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు.అందుకే దేశం నలుమూలలా స్కూళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేజీవ్రాల్‌ ‌పేర్కొన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ ‌సహా ఇతర రాజకీయ పార్టీలన్నీ తాను చేపట్టిన మిషన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తన మిషన్‌ ‌ప్రధానంగా విద్య, వైద్య, సేద్య రంగాలపై దృష్టిసారిస్తుందని చెప్పారు. ఈ మిషన్‌ ‌ద్వారా 130 కోట్ల భారతీయులను ఏకతాటిపైకి తీసుకువస్తానని తెలిపారు. మనం 75 ఏండ్ల స్వాతంత్య ్రఫలాలను అనుభవిస్తున్నాం..మనం ఎంతో సాధించినా ప్రజలు ఇంకా కడగండ్లకు లోనవుతూ పాలకులపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. స్వాతంత్య్ర సిద్ధించిన వెంటనే ఎన్నో చిన్న దేశాలు అభివృద్ధిలో మనకంటే వేగంగా పరుగులు పెట్టాయని గుర్తుచేశారు. మనం దేశవ్యాప్తంగా 27 కోట్ల మంది చిన్నారులకు మెరుగైన, ఉచిత విద్యను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కుటుంబానికి చెందిన ఓ చిన్నారి వారి కుటుంబాన్ని పేదరికం నుంచి సంపన్నులుగా మార్చ గలడని, ఇది విద్యతోనే సాధ్యమని కేజీవ్రాల్‌ ‌స్పష్టం చేశారు. దీనికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడరాదని పిలుపు ఇచ్చారు. అప్పుడే భారత్‌ ‌పేరు సంపన్న దేశాల జాబితాలోకి చేరుతుందని పేర్కొన్నారు. ఇక మెరుగైన, ఉచిత వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా చూడటం అత్యవసరమని స్పష్టం చేశారు. విశ్లేషకుల కథనం ప్రకారం, గుజరాత్‌ ‌శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఢిల్లీలో పాగా వేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌ను కూడా కైవసం చేసుకోవడంతో ఆ పార్టీలో గొప్ప ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఇక గుజరాత్‌ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా కేజీవ్రాల్‌ ‌పావులు కదుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page