మేలో 1,40,885 కోట్ల రూపాయల జిఎస్టీ వసూళ్లు

  • గత ఏడాదితో పోల్చి చూస్తే 44 శాతం పెరుగుదల
  • 4వ సారి 1.40 లక్షల కోట్ల మార్క్‌ను దాటిన వసూళ్లు

హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 1 : ‌మే నెలలో 1,40,885 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు వొచ్చాయి. అందులో సిజీఎస్టీ రూ. 25,036 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 32,001 కోట్లు కాగా ఐజీఎస్టీ రూ.73,345 కోట్లు(దిగుమతి అయిన వస్తువులపై వసూలు చేసిన 37469 కోట్లు కలుపుకుని), సెస్‌ 10,502 ‌కోట్లు( దిగుమతి అయిన వస్తువులపై వసూలు చేసిన 931 కోట్లు కలుపుకుని) ఉన్నాయి. ప్రభుత్వం ఐజీఎస్టీ నుంచి రూ. 27,924 కోట్లను, సిజీఎస్టీకి రూ. 23,123 కోట్లను ఎస్జీఎస్టీకి సర్దుబాటు చేసింది. సాధారణ సర్దుబాట్ల తర్వాత 2022 మే నెలలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సిజీఎస్టీగా రూ. 52,960 కోట్లు, ఎస్జీఎస్టీగా రూ. 55,124 కోట్లుగా ఉంది. దీనితో పాటు జీఎస్టీ పరిహారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మే 31న 86912 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది.

గత ఏడాది మే నెలలో జరిగిన జీఎస్టీ రాబడితో పోల్చి చూస్తే ఈ సంవత్సరం మే నెలలో వొచ్చిన రాబడి 44 శాతం ఎక్కువగా ఉంది. గత ఏడాది మే నెలలో జీఎస్టీ రాబడి 97,821 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాది మే నెలతో పోల్చి చూస్తే ఈ •ంవత్సరం మే నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వొచ్చిన ఆదాయం 30 శాతం మేరకు పెరిగింది. అదేవిధంగా, గత ఏడాది మే తో పోల్చి చూస్తే ఈ నెలలొ దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ద్వారా వచ్చిన ఆదాయాలు 17 శాతం ఎక్కువగా ఉన్నాయి. జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది వరుసగా నాల్గవసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page