మోదీ, బోడీకి బెదిరేది లేదు

  • గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తరు
  • ఇప్పుడున్న లీడర్లంతా బఫూన్లు
  • ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులది వీరోచిత పోరాటం
  • టీఆర్‌ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని కేటీఆర్‌ ‌తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్‌ ‌పాల్గొని ప్రసంగించారు. గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తరు. మోదీ, బోడీ, నీ ఈడీ మా వెంట్రుక కూడా పీకలేరు. ఏం చేసుకుంటవో చేసుకోపో. చావనైనా చస్తాం.. నీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తే లేదు. తప్పు చేయనోళ్లు ఎవరికీ భయపడరు. ఆరోపణలు మోదీ మీద వచ్చాయి. శ్రీలంక దేశంలో అక్కడి ప్రభుత్వ పెద్దలు, విద్యుత్‌రంగ సంస్థ అధిపతి.. మోదీ మీద ఆరోపణలు చేశారు. రూ. 6 వేల కోట్ల కాంట్రాక్ట్ ‌గౌతం అదానీకి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నీకు నీతి, సిగ్గు, మానం ఉంటే దాని మీద వివరణ ఇవ్వండి. అది వాస్తవమా? కాదా? చెప్పాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. దీనిపై ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలన్నారు. దేశం ఒక వైపు పేదరికంలోకి పోతోంది. నిరుద్యోగం పతాక స్థాయికి చేరింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. 8 ఏండ్లలో మోదీ చేసిందేమీ లేదని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. పేదలున్న దేశంగా భారత్‌ ‌మారింది. ధనవంతులే ధనవంతులుగా మారిపోతున్నారు.

ఒక అదానీ, రాజగోపాల్‌ ‌రెడ్డి ధనవంతులైతే ఈ దేశ ప్రజల భాగ్య రేఖలు మారిపోతాయా? అని ప్రశ్నించారు. మన తెలంగాణ మోడల్‌ను దేశానికి చూపేందుకే భారత్‌ ‌రాష్ట్ర సమితి అని పెడుతున్నాం. బరాబర్‌ ‌పరిచయం చేస్తాం. గుజరాత్‌ ‌మోడల్‌తో దేశాన్ని గోల్‌మాల్‌ ‌చేసినప్పుడు , బ్రహ్మాండంగా పని చేస్తూ, పేదవారికి అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, భారత్‌ ‌రాష్ట్ర సమితి ఎందుకు కావొద్దు. ఇక్కడ ఎవరెవరో రాజకీయం చేయొచ్చు. కానీ తెలంగాణ వారు బయటకు వెళ్లి రాజకీయం చేయొద్దా? తెలంగాణకు చేసినట్లే.. దేశంలోని ఇతర ప్రాంతాలకు మన అభివృద్ధిని విస్తరిద్దాం. బలంగా గులాబీ జెండాను ఇతర ప్రాంతాల్లో నాటుదామని కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌కలిసిపోయాయన్నారు మంత్రి కేటీఆర్‌. ‌కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కోవర్ట్ ‌బ్రదర్స్‌గా అభివర్ణించారు. తమ్ముడు బీజేపీ తరపున పోటీలో ఉంటే.. కాంగ్రెస్‌ ఎం‌పీగా ఉన్న అన్నయ్య ఆస్టేల్రియా టూర్‌కు వెళ్తున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి బద్రర్స్ ‌కోవర్టులు అనేదానికి.. ఇంతకంటే నిదర్శన ఇంకేం కావాలన్నారు.

మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి టార్గెట్‌గా సీరియస్‌ అయ్యారు. ఇక కాంట్రాక్టర్‌ అహంతో మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి కేటీఆర్‌గ్•ర్‌ అయ్యారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ‌కోసం ఉప ఎన్నిక వచ్చిందన్నారు. తమ మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి ఛాలెంజ్‌కు కట్టుబడి ఉన్నామని, మునుగోడుకు కేంద్రం రూ.18 వేల కోట్ల నిధులు ఇస్తే ఉప ఎన్నిక నుండి తప్పుకుంటామని పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా చెప్తున్నానని అన్నారు. మునుగోడు అభివృద్ధికి నిధులు కావాలని కేటీఆర్‌ ‌సైతం డిమాండ్‌ ‌చేశారు. ఒక్క సీటుతో వచ్చేది లేదు పోయేది లేదని పేర్కొన్నారు. వేల కోట్లతో మునుగోడులో అంగడి సరుకులా ఓట్లను కొనాలని చూస్తున్నారంటూ బీజేపీపై ఫైర్‌ అయ్యారు మంత్రి కేటీఆర్‌. ‌నల్గొండ జిల్లాలో ప్లోరోసిస్‌ ‌ప్రకృతి సమస్య కాదన్న ఆయన.. ప్లోరైడ్‌పై సీఎం కేసీఆర్‌ ‌స్వయంగా పాటలు రాశారని గుర్తు చేశారు. సావానైనా సస్తాం కానీ మోడీకి మాత్రం లొంగేది లేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌. ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి కాంట్రాక్టుల అంశంపై.. సుప్రీంకోర్టు సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేశారు. తప్పు చేయకపోతే కాంట్రాక్టును వదులుకోవాలని, లేదంటే భాగ్యలక్ష్మి ఆలయానికి గానీ, తాము కట్టిన యాదాద్రి ఆలయానికి రావాలని కెటిఆర్‌ ‌సవాల్‌ ‌విసిరారు.

ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులది వీరోచిత పోరాటం
తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు వీరోచిత పోరాటం చేశారని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్థులంతా వీరోచిత పోరాటం చేసిన సమయంలో ఇప్పుడు టి బీజేపీ, టీ కాంగ్రెస్‌ ‌పేరిట పదవులు అనుభవిస్తున్న వారు ఎక్కడా కనబడలేదని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్‌ ‌ప్రసంగించారు. తెలంగాణ రాక ముందు మీరంతా ఉస్మానియా, పాలమూరు, కాకతీయ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో వీరోచితంగా పోరాటం చేసిన సమయంలో ఈ బఫూన్‌ ఎక్కడా కనబడలేదు. కేసీఆర్‌ ‌లేకపోతే టీఆర్‌ఎస్‌ ‌లేదు. టీఆర్‌ఎస్‌ ‌లేకపోతే ఈ దఫా తెలంగాణ ఉద్యమం లేదు. ఉద్యమంలో మీరంతా లేకపోతే తెలంగాణ వొచ్చుడే లేదు. ఈ తెలంగాణ రాకపోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్‌ ఉం‌డేవి కావు. మీరు పెట్టిన భిక్షనే ఆ పదవులు అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఇప్పుడున్న నాయకులు ఎంత చిల్లర అంటే నవ్వాలో, ఏడ్వాల్నో కూడా తెల్వదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

నిజంగా కొట్లాడుదామంటే ఇదివరకు మనకు మంచిగా ఉండే. మనకు ప్రత్యర్థులు మంచిగా ఉండే. చంద్రబాబు, రాజశేఖర్‌ ఉం‌డే. వారితో కొట్లాడినా గమ్మత్తు ఉండే. వాళ్లు కూడా ఒక స్థాయి లీడర్లు కాబట్టి. వారితో ఓ మాట అన్న, ఓ మాట పడ్డ ఒక పద్ధతి ఉండే. ఇప్పుడు ఉన్న వారితో అయితే ఆగం ఉంది. ఎలాంటి బఫూన్‌ ‌గాళ్లను మనకు తగిలించారంటే…కొట్లాట చేత కాదు..మాట్లాడటం చేత కాదు. తెలంగాణకు ఒక్క రూపాయి తెచ్చే తెలివి లేదు. సొంత పార్లమెంట్‌లో అర పైసా పని కూడా చేయలేదు. ఎంత చిల్లర రాజకీయం అంటే.. కేసీఆర్‌ ‌క్షుద్ర పూజలు చేస్తుండట. నల్ల పిల్లిని ముందు పెట్టుకొని పూజ చేస్తున్నాడని ఆ బఫూన్‌ ‌మాట్లాడుతుంటే నవ్వు వొస్తుందని కేటీఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page