మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట

రూ.47.66 లక్షలతో బడ్జెట్‌ పద్దు
వృద్ధి పెంపుకు ఆర్థిక సంస్కరణలు
ఆదాయం రూ.30.80లక్షల కోట్లు
మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు
రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు
వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశారు. మొత్తంగా మౌలిక వసతుల రంగానికి అత్యధికంగా రూ.11.11లక్షల కోట్లు కేటాయించారు. భారత దేశ వృద్ధిని పెంచడానికి ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌. కేంద్ర బడ్జెట్‌లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చేశారు. బడ్జెట్‌ పరిమాణం మొత్తం రూ.47.66లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇక సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ మంత్రంతో ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కున్నట్లు నిర్మల వివరించారు.

ఇక బడ్జెట్‌లో శాఖల వారీగా ప్రధానంగా కేటాయింపులను పరిశీలిస్తే…మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు, రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు, రైల్వేశాఖకు రూ.2.55 లక్షల కోట్లు, హోమ్‌ శాఖకు రూ.2.03 లక్షల కోట్లు, వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27లక్షల కోట్లు, గ్రావిూణాభివృద్ధి శాఖకు రూ.1.77 లక్షల కోట్లు, ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2.78 లక్షల కోట్లు, ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2.13 లక్షల కోట్లు, రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్‌ రంగానికి రూ.1.37 లక్షల కోట్లు, గ్రావిూణ ఉపాధిహావిూ పథకానికి రూ.86 వేల కోట్లు, ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి రూ.7500 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200 కోట్లు, సెవిూ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903 కోట్లు, సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు రూ.8500 కోట్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌కు రూ.600 కోట్ల కేటాయింపులకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page