ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని అఖిల భారతీయ జాతీయ యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి గొంటి కుమార్ చౌదరి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పలు డిమాండ్ల సాధన కోసం ఇందిరాపార్క్ లో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుమార్ చౌదరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలన్నారు. గతంలో ఉన్న ఎస్.ఎన్.టి రిజర్వేషన్లలను పునరుద్దరించాలని అన్నారు. అదే విధంగా వారానికి కొన్ని వందల బర్రెలు ఇతర రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా వస్తున్నాయని, ఆ బర్రెలను తీసుకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా వుండాలంటే కేంద్ర ప్రభుత్వం గతంలో వున్న ట్రైన్ సౌకర్యం మళ్లీ కల్పించాలన్నారు. తెలంగాణలోని డైరీలు నడిపిస్తున్న యాదవులకు ప్రభుత్వం మూడు ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. గతంలో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం 1990 లో ఎంసిహెచ్ అధికారులు ప్రతి డైరీని పరిశీలించి ప్రభుత్వ స్థలం కేటాయిస్థామని ఇచ్చిన హామి నెరవేర్చాలన్నారు. పశువుల పోషకానికి స్థలాలు లేక అలీకబీర్ కి పోతున్నాయన్నారు. నేడు ఒక బర్రె రూ.1.40 లక్షలకు కొనడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క బర్రెకు 45 శాతం శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను నెరవేర్చని పక్షంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అమరణ నిరహారణ దీక్ష చేపడతానని హెచ్చరించారు.