గురువారం తెలంగాణ లో తిరిగి ప్రారంభ మయిన భారత్ జోడో యాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జై రామ్ రమేష్ మీడియా సమావేశంలో కన్యాకుమారి నుంచి తెలంగాణ నుంచి పాల్గొన్న యాత్రికుల ను పరిచయం చేస్తూ వారి అనుభవాలను మీడియా తో పంచుకునే అవకాశం కల్పించారు.
జైరామ్ రమేష్ మాట్లాడుతూ నవంబర్ 4 న రాహూల్ గాంధీ తెలుగు మీడియా తో మాట్లాడుతారు అని తెలుపుతూ దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు సామాన్య ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసాయని పేర్కొంటూ.. ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్న మోదీ విధానాల పట్ల అప్రమత్తం చేయడానికే భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగిందని తెలిపారు. దేశంలో బిజేపీ, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి రెండూ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొంటూ ఈ రెండు పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత జాతీయ కాంగ్రెస్ పార్టీ పై ఉందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతు,ప్రమేయం లేకుండా బిజేపీ కి ప్రత్యామ్నాయం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఎన్నికల కోసం ఈ యాత్ర చేపట్టలేదని..పార్టీ బలోపేతం కోసం, కార్యకర్తల క్రమశిక్షణ కోసం ఈ యాత్ర చేపట్టడం జరిగిందని జైరామ్ రమేష్ అన్నారు.
జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పై విశ్వాసం ఉన్న పార్టీ.. అందుకే పార్టీ జాతీయ అధ్యక్షడు నీ ఎన్నికల ద్వారా ఎన్నుకున్నామని..వేరే ఇతర పార్టీల లో ప్రజాస్వామ్యం లేదని జైరామ్ రమేష్ అన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంశం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.