యూపీఎస్సీ -2021లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు జి సుధీర్ రెడ్డి (69), స్నేహ (136), చైతన్య రెడ్డి (161), రంజిత్ కుమార్ (574), స్మరణ రాజ్ (676) సహా, సివిల్స్ సబ్జెక్ నిపుణురాలు, మెంటర్ బాలలత బుధవారం కోకాపేటలోని నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా మంత్రి వారిని శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం చేసారు .
ఎంతో కష్టపడి, దేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీస్ చేరుకోవడం గొప్ప విషయం అని, తెలంగాణ గర్వించేలా, దేశం మెచ్చేలా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్ష. బాలలత లాంటి మెంటార్స్ సలహాలు, సూచనల వల్ల విజయ అవకాశాలు మరింత చేరువ అవుతాయన్నారు. పోలియో మహమ్మారి రూపంలో వైకల్యం కలిగినా, గెలుపు మీద కసితో రెండు సార్లు సివిల్స్ ర్యాంకు సాధించడం గొప్ప విషయం అని బాలలత గారికి అభినందనలు తెలిపారు.