రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు 

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 18: రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులు అండగా ఉంటారని  బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు. ప్రతిపక్ష పార్టీల మాటలు ప్రజలు నమ్మవద్దని సూచించారు .సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచపురం గ్రామంలోని కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఎంపీపీ మాణిక్య రెడ్డి తెలిపారు. రెడ్డి సంఘం సభ్యులు మద్దతు తెలిపినట్లు తెలిపారు. హరీష్ రావు పైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నట్లు తెలిపారు .భూమికి బరువైన వరి పంట పండుతున్నట్లు తెలిపారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు తెలిపారు . మైలారం మాజీ ఎంపీటీసీ ఉడతం కనకయ్య కొమరయ్య నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ప్రజల అండదండలు ఉన్నట్లు తెలిపారు .కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత రవీందర్ రెడ్డి ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర ఎంపిటిసిల పోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్ గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు అల్లిపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్ సర్పంచు బాబు ఎంపిటిసి జమున ఎల్లయ్య మాజీ సర్పంచ్లు రాజా రెడ్డి నరసింహారెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.చేరికలు.మైలారం
 మాజీ ఎంపీటీసీ  ఒడిత్తం కనుకయ్య ,ఉడితం కొమురయ్య  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్బంగా కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన రాష్ట్ర పార్టీ కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ మాణిక్య రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page