రబీ పంటల కనీస మద్దతు ధరకు కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం

హైదరాబాద్‌, ‌పిఐబి, అక్టోబర్‌ 18 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశం అయిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2023-24 మార్కెటింగ్‌ ‌సీజన్‌లో రబీ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు చెల్లిస్తున్న కనీస మద్దతు ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యధికంగా కందులు  ధర పెరిగింది. క్వింటాల్‌ ‌కందులు (మసూర్‌) ‌మద్దతు ధర  500 రూపాయలు పెరిగింది. ఆవాలు, రాప్సీడ్‌ ‌మద్దతు ధర క్వింటాలుకు 400 రూపాయలు పెరిగింది. కుసుమకు క్వింటాలుకు 209 రూపాయల ఎక్కువ ధర చెల్లించేందుకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. గోధుమలు, శనగలు మరియు బార్లీలకు వరుసగా క్వింటాల్‌కు 110 రూపాయలు, 100 రూపాయల చొప్పున పెంచడానికి మంత్రివర్గం ఆమోదం లభించింది.

కూలీలు, ఎద్దులు /యంత్రాలకు చెలించే కిరాయి, లీజుకు తీసుకున్నందుకు భూమికి చెల్లించిన కౌలు, విత్తనాలు, ఎరువులు, పోషకాలు, నీటిపారుదల ఛార్జీల వంటి పదార్థాల వినియోగం కోసం జరిగే వ్యయం, పనిముట్లు మరియు వ్యవసాయ భవనాలపై తరుగుదల, మూలధనంపై  వడ్డీ, పంపు సెట్ల నిర్వహణ కోసం ఉపయోగించే డీజిల్‌/‌విద్యుత్‌ ‌ధర, కుటుంబ శ్రమ ఖర్చులు మరియు లెక్కింపబడిన విలువ అయ్యే ఖర్చులు వంటి అన్ని చెల్లించిన ఖర్చులను ధర నిర్ణయంలో పరిగణనలోకి తీసుకున్నారు. జాతీయ స్థాయిలో నిర్ణయించిన సరాసరి ఉత్పత్తి వ్యయం రబీ పంటలకు చెల్లించే కనీస మద్దతు ధర కంటే 1.5 రెట్లు ఎక్కువగా నిర్ణయించాలని 2018-19 కేంద్ర బడ్జెట్‌ ‌సమయంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 2023-24 రబీ పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించడం జరిగింది. దీనివల్ల రైతులకు సరైన గిట్టుబాటు ధర లభిస్తుంది.

గరిష్ట రాబడి రేటు రాప్‌సీడ్‌ ‌మరియు ఆవాలకు 104 శాతం, ఆ తర్వాత గోధుమలకు 100 శాతం, కాయ ధాన్యాలకు  85 శాతం, పప్పు ధాన్యాలకు  66 శాతం,  బార్లీ పై  60 శాతం, కుసుమకు 50 శాతం గరిష్ట రాబడి రేటు ఉంటుంది. పప్పుధాన్యాలు, నూనె గింజల దిగుబడి ఎక్కువ చేయడానికి 2014-15 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల పప్పుధాన్యాలు, నూనె గింజల దిగుబడి పెరిగింది. 2014-15లో 27.51 మిలియన్‌ ‌టన్నులుగా ఉన్న నూనె గింజల దిగుబడి 2021-22 నాటికి (4 వ  ముందస్తు అంచనాల ప్రకారం ) 37.70 మిలియన్‌ ‌టన్నులకు చేరింది. పప్పు ధాన్యాల దిగుబడి కూడా ఇదే తరహాలో పెరిగింది. ప్రభుత్వం ప్రారంభించిన విత్తన మినీ కిట్స్ ‌కార్యక్రమం వల్ల రైతులకు నూతన వంగడాలు అందుబాటులోకి వొచ్చాయి. పొలాల్లో కొత్త రకాల విత్తనాలు వేయడం, విత్తన మార్పిడి  వల్ల పంట దిగుబడి పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page