హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు వి•దుగా కొమరం వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోవి•టర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శనివారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.