రాజగోపాల్‌పై టిఆర్‌ఎస్‌ ‌విషప్రచారం

  • హావిలను నెరవేర్చని సిఎం కెసిఆర్‌
  • ‌ప్రచారంలో మండిపడ్డ డికె అరుణ

నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హావి•లను నెరవేర్చకుండా కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌కుటుంబాన్ని అంతం చేయడానికే రాజగోపాల్‌ ‌రెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి రాజీనామాతోనే మునుగోడు నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజగోపాల్‌ ‌రెడ్డి రాజీనామా చేశారని, ఆయన రాజీనామాతోనే ‘గట్టుప్పల్‌’ ‌ను కేసీఆర్‌ ‌మండలంగా ప్రకటించారని చెప్పారు.

ఉప ఎన్నికలో ఓడిపోతామనే అభద్రతా భావంతో టీఆర్‌ఎస్‌ ‌నాయకులందరూ మునుగోడు నియోజకవర్గంలో వాలిపోయారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ‌పరిపాలనలో ప్రచారం తప్ప ఏవి• లేదన్నారు. మునుగోడు తీర్పే తెలంగాణకు కీలక మలుపు అని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌ ‌మండలంలో నిర్వహించిన ఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి లక్ష్మీతో కలిసి డీకే అరుణ పాల్గొన్నారు. ఇదిలావుంటే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మునుగోడుకు చేసిందేవి• లేదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి విమర్శించారు. తాను రాజీనామా చేయకపోతే మునుగోడు గురించి ఎవరూ మాట్లాడేవారే కాదన్నారు.

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నిక రావడంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి క్యూ కడుతున్నారని అభిప్రాయపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇతర పార్టీల వారిని బెదిరిస్తూ తమ పార్టీ  కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. మునుగోడులో జరుగుతున్న ధర్మ యుద్ధంలో ధర్మాన్ని గెలిపించాలని రాజగోపాల్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితం వచ్చాక కేసీఆర్‌ ‌కుటుంబమంతా విమానంలో పారిపోవాల్సిందే అని రాజగోపాల్‌ ‌రెడ్డి సెటైర్‌ ‌వేశారు.

పింఛన్‌ ‌రాదేమోనని భయపడి టీఆర్‌ఎస్‌ ‌కు ఓటు వేయొద్దని జనానికి సూచించారు. ఈ ధర్మ పోరాటంలో ఓటర్లు ఇచ్చే తీర్పు విదే మునుగోడు భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ ప్రచారంలో రాజగోపాల్‌ ‌రెడ్డితో పాటు బీసీ కమిషన్‌ ‌సభ్యులు తల్లోజు ఆచారి, మర్రిగూడ మండలం ఇంచార్జి కొండ విశ్వేశ్వర్‌ ‌రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page