ప్రజలకు చేరువై వారి సమస్యలపై దృష్టి పెట్టా
మంచిచేసే క్రమంలో అవమానాలు ఎదుర్కొన్నా
మూడేళ్ల పదవీకాలంపై వి•డియాతో తమిళసై
మహిళా గవర్నర్ ను అయినందుకు తనపై వివక్ష చూపించారని గవర్నర్ తమిళి సై అన్నారు. రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఇంకా పని చేస్తానన్నారు. సన్మానం చేసినా చేయకపోయినా పనిచేశానన్నారు. గౌరవం ఇవ్వక పోతే తానేం తక్కువ కాదన్నారు. రాజ్ భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చామని… పేదప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచామన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి చేసే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చిందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నేటితో మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ వి•డియాతో మాట్లాడారు. నాకు గౌరవం ఇవ్వకపోతే ఎవ్వరినీ లెక్క చేయను. నేను ఎవరికీ తక్కువ కాదన్న ఆలోచనలో భాగంగా మంచి చేసేందుకు ముందుకు వెళ్తాను అని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజ్ భవన్ మొదటి సారి ప్రజా భవన్ అయిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అనేక ట్రైబల్ ఏరియాలను విజిట్ చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసినట్లు చెప్పారు. పౌష్ఠికాహారలోపంతో బాధపడుతున్న పిల్లల పట్ల బాధ్యతగా పని చేశామన్నారు. యునివర్సిటీ లను సందర్శించి విద్యార్థుల ఇబ్బందులపై సీఎం (అఓ ఐఅఖీ)కు లేఖ రాశామని చెప్పారు. వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను సందర్శించి ప్రభుత్వానికి వివరాలు అందించినట్లు గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.ఆదివాసీ గూడెంలను దత్తత తీసుకున్నామని చెప్పారు. ఆదివాసీల కోసం మెడికల్ క్యాంపు, అంబులెన్స్, ఆర్థిక పరిపుష్టత కోసం పని చేశామన్నారు. మహిళా దర్బార్, విద్యార్థుల కోసం పోటీ పరీక్షలు నిర్వహించామని గవర్నర్ తమిళి సై అన్నారు. యూనివర్సిటిలలో ఉన్న విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాశానని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తన వంతు సహాయం చేశానని చెప్పారు. పేద ప్రజల మీద ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నానన్నారు.. తాను చెసే ప్రతి పని పేద ప్రజల కోసమేనన్నారు. మేడారం వెళ్ళినప్పుడు దాదాపు 8 గంటల పాటు కారులో ప్రయాణం చేశానని అన్నారు. తెలంగాణ ప్రాంతం సంస్కృతి సంప్రదాయాలతో ముడి పడి ఉంటుందన్నారు.బాసర ట్రిపుల్ ఐటీ పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి వ్యక్తి గత ద్వేషాలు లేవన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నవి ప్రజల కోసమేనన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య ఉత్సవాల సందర్భంగా కూడా గవర్నర్ ను అవమానించారన్నారు. గవర్నర్ ప్రోటోకాల్ ను పూర్తిగా తుంగలో తొక్కారన్నారు.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా యన్నారు.